• చిన్నచిన్న పాత్రలతో గుర్తింపు 
  • హీరోయిన్ గా యూత్ లో క్రేజ్ 
  • త్వరలోనే మెగా ఫోన్ పట్టాలనే నిర్ణయం 

తెలుగు .. తమిళ భాషల్లో ధన్య బాలకృష్ణ వివిధ రకాల పాత్రలను పోషించింది. చిన్న చిన్న పాత్రలే చేసినా, ఆకర్షణీయమైన రూపంతో ఆకట్టుకుంటూ వచ్చింది. ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ సినిమాతో కథానాయికగా ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా, ఆమె గ్లామర్ కుర్ర మనసులను ఆకట్టుకుంది.

త్వరలో ఆమె ‘అనుకున్నదొక్కటి .. అయినది ఒక్కటి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. “ప్రస్తుతం నటనపైనే దృష్టి పెట్టాను. కానీ భవిష్యత్తులో దర్శకురాలిగా మారాలనే ఆలోచన వుంది. లేడీ ఓరియెంటెడ్ కథతోనే నా తొలి సినిమా రూపొందుతుంది. దర్శకత్వం చేస్తూనే ఆ సినిమాలో నేనే ప్రధాన పాత్రధారిగా చేస్తాను. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. ఇలా ఆ సినిమాలో అన్నిరకాల అంశాలు ఉంటాయి” అని చెప్పుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *