స్వయం సమృద్ధం కావాలన్నదే లక్ష్యం -కేంద్ర ఆర్థిక మంత్రి

మంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌  ప్యాకేజీలో ఇవాళ ఆఖరి విడత కేటాయింపులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. సంక్షోభం విసిరిన సవాళ్లను ఎదుర్కొని స్వయం సమృద్ధం కావాలన్నదే లక్ష్యమని వెల్లడించారు. సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవాలని ప్రధాని నిరంతరం చెబుతున్నారని గుర్తు చేశారు. ప్యాకేజీలోని ఏడు అంశాలకు సంబంధించి వివరాలను వెల్లడించారు.

ఆర్థిక మంత్రి ప్రకటనలోని ముఖ్యాంశాలు..
* భూమి, శ్రామిక శక్తి, నగదు లభ్యత, విధాన నిర్ణయాల్లో సంస్కరణలు. ఈ నాలుగు అంశాల్లో పలు కీలక నిర్ణయాలు ఇప్పటికే ప్రకటించాం.

* దేశంలో ప్రతి మూలకు ఆహారధాన్యాల సరఫరా చాలా కీలకమైన సవాల్‌. రాష్ట్ర ప్రభుత్వాలు, ఎఫ్‌సీఐ ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాయి.

* వలస జీవుల ఆకలి తీర్చటంలో స్వచ్ఛంద సంస్థలు తమ వంతు పాత్ర పోషించాయి.

* ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజనలో భాగంగా వివిధ వర్గాలకు డీబీటీతో నగదు బదిలీ.

* సాంకేతిక పరమైన సంస్కరణలు జరగకపోయి ఉంటే అది సాధమయ్యేదే కాదు.

* ప్రధానమంత్రి కిసాన్‌ యోజన, సంక్షేమ పింఛన్లు రూపంలో వేల కోట్లరూపాయల బదిలీ చేశాం.

* లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చే విషయంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను దాదాపు చేరుకున్నాం.

* 20కోట్ల జన్‌ధన్‌ఖాతాల్లోకి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద నగదు బదిలీ చేశాం. డీబీటీ విధానం వల్ల లబ్దిదారుల ఖాతాల్లోకే నేరుగా నిధుల బదిలీ సాధ్యమైంది.

* 12లక్షలమంది ఈపీఎఫ్‌లో చందాదారులు ఆన్‌లైన్‌ ఉపసంహరణలతో  రూ.3,660 కోట్ల నగదు వెనక్కు తీసుకునే అవకాశం కల్పించాం.

*  కరోనా మహమ్మారి కమ్మేసిన సంక్షోభంలో సాంకేతికత సంస్కరణల సాయంతోనే ఎంతో మేలు జరిగింది.

* భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లో రూ.3,955 కోట్లు జమ చేశాం.

విద్యారంగంలో ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌కు భారీ ఎత్తున ప్రోత్సాహం. విద్యారంగం కోసం ఇప్పుడున్న 3 ఛానెళ్లకు అదనంగా మరో 12 స్వయంప్రభ ఛానెళ్లు ఏర్పాటు. విద్యార్థుల కోసం కరిక్యులమ్‌, ఆన్‌లైన్‌ కరిక్యులమ్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *