తెలంగాణలో 199 కొవిడ్ కేసులు…

తెలంగాణలోకరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. లాక్ డౌన్ నుంచి సడలింపులు కూడా ఇవ్వడంతో.. కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ ఒక్క రోజే తెలంగాణలో 199 కేసులు నమోదు కాగా.. ఐదుగురు మృతి చెందారు. మొత్తం కొవిడ్-19 బాధితుల్లో తెలంగాణకు చెందినవి 196 కాగా, ముగ్గురు వలస కార్మికులు ఉన్నారు.

122 జీహెచ్ఎంసీలోనే

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కరోనా విరుచుకుపడుతోంది. ఆదివారం ఒక్క రోజే జీహెచ్ఎంసీలో భారీగా కేసులు వెలుగుచూశాయి. మొత్తం 199 కొవిడ్ కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 122 కేసులు నమోదయ్యాయి. మిగతా కేసులు రంగారెడ్డి(40), మేడ్చల్‌(10), ఖమ్మం(9), మహబూబ్‌నగర్‌(3), జగిత్యాల(3), మెదక్‌(3), వరంగల్‌ అర్బన్‌(2), సూర్యాపేట(1), నిర్మల్‌(1), యాదాద్రి(1), జనగామ(1) జిల్లాల్లో ఇవాళ కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇకరాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,698 కేసులు నమోదుకాగా.. మహమ్మారి బారిన పడి 82 మంది మృత్యువాత పడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *