చంద్రబాబుపై లాక్ డౌన్ ఉల్లంఘన కేసు…

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు పై లాక్ డౌన్ నిబందనల ఉల్లంఘన కేసు నమోదు అయింది. కృష్ణాజిల్లా నందిగామ పోలీస్ స్టేషన్ లో ఒక లాయర్ చేసిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు భారీ కాన్వాయ్‌తో , లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా జగ్గయ్యపేట, కంచికర్లలో జనసమీకరణకు కారణమయ్యారని శ్రీనివాస్ అనే న్యాయవాది శ్రీనివాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్‌ 188 కింద కేసుల నమోదు చేశారు.

గత రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లాకు చెందిన మొహమ్మద్ అలీ అనే వ్యక్తి సైతం హైదరాబాద్ నుంచి కాన్వాయ్‌లో బయలుదేరిన చంద్రబాబు లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి, కరోనా వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణమయ్యారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు లాక్‌డౌన్‌ రూల్స్‌ ఉల్లఘించారని వీడియోల ఆధారాలు సమర్పిస్తూ ఏపీ డీజీపీ, విజయవాడ పోలీస్‌ కమిషనర్, కృష్ణా జిల్లా ఎస్పీతో పాటు తోట్లవల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో అలీ ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *