శాంసంగ్ నుంచి మరిన్ని బడ్జెట్ ఫోన్లు.. ధర ఎంతంటే?

శాంసంగ్ తన బడ్జెట్ ఫోన్లు గెలాక్సీ ఎం11, ఎం01 స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసే సమయం వచ్చేసింది. జూన్ 2వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ఫ్లిప్ కార్ట్ లిస్టింగ్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఈ ఫోన్లు ఫ్లిప్ కార్ట్ లో ఎక్స్ క్లూజివ్ గా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. వీటిలో శాంసంగ్ గెలాక్సీ ఎం01 స్మార్ట్ ఫోన్ ధర రూ.10 వేలలోపు, గెలాక్సీ ఎం11 స్మార్ట్ ఫోన్ ధర రూ.15 వేలలోపు ఉండనున్నట్లు తెలుస్తోంది.

శాంసంగ్ ఇప్పటికే గెలాక్సీ ఎం11 స్మార్ట్ ఫోన్ ను ఈ సంవత్సరం మార్చిలోనే ప్రకటించింది. ఇందులో 6.4 అంగుళాల హెచ్ డీ+ ఇన్ ఫినిటీఓ ఎల్సీడీ డిస్ ప్లే అందుబాటులో ఉంది. పంచ్ హోల్ తరహా డిస్ ప్లేను ఇందులో అందించారు. వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ రెండు వేరియంట్లు ఇందులో ఉన్నాయి. ఇంటర్నల్ స్టోరేజ్ ను మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. యూఎస్ బీ టైప్సీ పోర్టును ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. కెమెరా విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలను అందించారు. 13 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా, 5 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ లను ఇందులో అందించారు. ముందువైపు 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం01 స్మార్ట్ ఫోన్ కు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. 5.71 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను ఇందులో అందించనున్నారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. బ్లాక్, బ్లూ, రెడ్ రంగుల్లో ఈ ఫోన్ ను అందించనున్నారు. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. 13 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా కాగా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఇందులో ఉండనున్నాయి. ఇక ముందువైపు 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉండనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *