చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ త‌యారీ సంస్థ షియోమీ.. రెడ్‌మీ సిరీస్‌లో నోట్ 9 ప్రొ  స్మార్ట్‌ఫోన్‌ను  ఇటీవల  భార‌త్‌లో విడుద‌ల చేసిన విషయం తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మరోసారి ఫ్లాష్‌సేల్ నిర్వహిస్తోంది. నోట్‌ 9 ప్రొ కోసం ఇప్పటికే ఒకసారి  ఆన్‌లైన్‌లో విక్రయాలు ప్రారంభించగా  వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.

కస్టమర్లు ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లు అమెజాన్‌ ఇండియా, ఎంఐ డాట్‌కామ్‌  ద్వారా కొనుగోలు చేయొచ్చు.  కొత్త ఫోన్‌ మూడు కలర్లలో అందుబాటులో ఉంది.  నోట్‌ 9 ప్రొ   4GB + 64GB,  6GB + 128GB  రెండు వేరియంట్లలో లభించనుంది. 4జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ.13,999 కాగా 6జీబీ వేరియంట్‌ ధర రూ.16,999గా నిర్ణయించారు.

స్పెసిఫికేషన్లు:

డిస్‌ప్లే: 6.67 అంగుళాలు

ప్రాసెసర్‌: స్నాప్‌డ్రాగన్‌ 720జీ

ఫ్రంట్‌ కెమెరా:19మెగాపిక్సల్‌(MP)

రియర్‌ కెమెరా: 48MP + 8MP + 5MP + 2MP

ర్యామ్‌:4జీబీ

స్టోరేజ్‌:64జీబీ

బ్యాటరీ:5020mAh

ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 10

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *