తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దయవల్ల కరోనా వ్యాధి పూర్తిగా తొలగిపోయి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నానని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం నుంచి ప్రారంభమైన జ్యేష్టాభిషేకం లో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఏటా జ్యేష్ట మాసం ప్రారంభం నుంచి మూడు రోజుల పాటు స్వామి వారికి జ్యేష్టాభిషేకం జరుపుతారని వైవి సుబ్బారెడ్డి అన్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ సారి జ్యేష్టాభిషేకం ఏకాంతంగా నిర్వహిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ నిబంధనల్లో ఇచ్చిన సడలిపులు, అనుమతుల నేపథ్యంలో ఈ నెల 8 వ తేదీ నుంచి స్వామి వారి దర్శనాలు ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *