హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములను సర్వే ఆఫ్‌ ఇండియాతో రీ సర్వే చేయించాలని కాంగ్రెస్‌ నాయకులు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కోరారు. అలాగే భూముల ఆక్రమణపై సీబీఐతో విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. బోగస్‌ సొసైటీల పేరుతో యూనివర్సిటీ భూముల్ని ఆక్రమించుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భూముల్ని కాపాడాలన్నారు. సోమవారం కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత భట్టివిక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. భట్టి విలేకరులతో మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాలను కాపాడాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. నిధులివ్వకుండా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విశ్వవిద్యాలయాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కో ఆపరేటివ్‌ సొసైటీ పేరుతో ఓయూ భూములను ఆక్రమించుకున్నారని వీహెచ్‌ తెలిపారు.

1 Comment

  1. Other of ED, there are multifarious who do not rather commence screening gain generic cialis online to oophorectomy it. sildenafil reviews Sbckzk sndbao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *