14న తెరుచుకోనున్న శబరిమల ఆలయం…

కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం ఈనెల 14న తిరిగి తెరుచుకోనుంది. మలయాలం మాసమైన మిథునం 15నుంచి ప్రారంభంకానుండడంతో ఆచారం ప్రకారం భక్తులు మాసపూజ, శబరిమల ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఈనెల 28వరకు ఆలయాన్ని తెరువనున్నట్లు దేవస్థానం మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ తెలిపారు.

ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 11గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుందని వెల్లడించారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే భక్తులు ప్రభుత్వ ‘కొవిడ్‌ జాగ్రత్త రిజిస్ట్ట్రేషన్‌ పోర్టల్లో’ నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. తమకు ఎలాంటి ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్స్‌ లేవని నిర్ధారిస్తూ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ల్యాబ్‌ జారీ చేసిన ధ్రువీకరణ పత్రాన్ని పోర్టల్లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని తెలిపారు. పంపా, సన్నిదానంలోనే భక్తులను తనిఖీ చేసి పంపుతామని, భక్తులు తప్పక మాస్కులు ధరించాలని.. ముందు జాగ్రత్త చర్యగా విశ్రాంత సమయంలో పరిసరాల్లో శానిటేషన్‌ చేపడతామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *