మనుషుల మధ్యనే మానవ సంబంధాలు క్రమంగా కనుమరుగవుతున్న తరుణం ఇది. సాయం చేసిన చేతులను కాల‌్చేసే రోజులివి. అంతేకాదు సాటి మనుషులు చావు బతుకుల్లో ఉన్నాడంటే… సాయం చేయడం మాట అటుంచి నవ్వుకునే వారి సంఖ్య పెరిగింది. కష్టాల్లో ఉన్న మనుషులను ఆదుకునే సమాజం నుంచి ఎన్నడో బయటికొచ్చేశాం. పైగా బతుకునిచ్చిన వారిపైన్నే ఈర్ష్య, ద్వేశాలతో కుట్రలతో కలుషితమైన లోకంలో మనం జీవిస్తున్నాం అనేది కాదనలేని నిజం. కానీ,చ అలాంటి సమాజంలో బతుకుతున్న మనకు… సిద్థిపేట జిల్లాకు చెందిన ఓ రైతు చేసిన పని ఎన్నో పాఠాలు నేర్పుతోంది. 20 ఏళ్లు తనకు అండగా ఉన్న మూగ జీవానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం ఇంకా బ్రతికే ఉందని నిరూపించాడు

వివరాల్లోకి వెళ్తే…. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన చెక్కపల్లి బుచ్చయ్య అనే రైతు 20 సంవత్సరాల నుంచి ఆవును పెంచుకుంటున్నాడు. ఆవు… ఇటు వ్యవసాయ పనులకు ఉపయోగపడుతూనే… 13 లేగదూడలకు జన్మనిచ్చింది. ఈ  లేగదూడలను పెంచి పెద్ద చేశాడు రైతు.  ఆవుతో ఇటు వ్యవసాయ పెట్టుబడికి, కుటుంబ పోషణ కొనసాగింది. అనుకోకుండా అనారోగ్యంతో ఆవు మృతి చెందింది దీంతో రైతు కుటుంబ సభ్యులు బోరున విలపించారు. తన కుటుంబానికి ఇంత సేవ చేసిన ఆవుకు ప్రత్యేక పూజలు చేసి ఘనంగా అంతక్రియలు చేశారు రైతు బుచ్చయ్య కుటుంబ సభ్యులు. అనంతరం రైతు మాట్లాడుతూ మాకు 20 సంవత్సరాల నుంచి ఆవు చేదోడువాదోడుగా ఉందని ఆవుతోనే కుటుంబ పోషణ వ్యవసాయ పెట్టుబడి కొనసాగిందని ఆవు మరణించడం బాధకరమని అన్నారు.

 

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *