మంగ్లీ…! తెలుగు ప్రజలకు పరిచయం లేని పేరు ఇది. మంగ్లీ అసలు పేరు సత్యవతి. 1994 జూన్‌ 10న అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లె తండాకు చెందిన సత్యవతి… మాటకారి మంగ్లీ, తర్వాత సింగర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.

మంగ్లీ.. పేద బంజారా కుటుంబంలో పుట్టింది. తాండ లోని 5 చదివి.. 6 నుండి 10 తరగతి వరకు స్థానిక గర్ల్స్ హై స్కూల్ లో చదివింది. తర్వాత… ఆర్‌డీటీ సంస్థ (Rural Development Trust) ద్వారా చదువుకొని పాటలు పాడటం నేర్చుకుంది. ఆదే సంస్థ సలహాతో, ఆర్థిక సహాయంతో తిరుపతిలో కర్నాటక సంగీతం నేర్చుకుంది. వారి ఆర్థిక సహాయంతోనే పదో తరగతి తర్వాత.. ఎస్.వీ. విశ్వవిద్యాలయంలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ డిప్లోమా కోర్సులో చేరింది. సంగీతలో పూర్తి మెళకువలు నేర్చుకుంది. ఆ తరువాత తన కెరియర్ మొదలు పెట్టి తెలంగాణలో పల్లె పాటలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచింది. మొదట జానపద గీతాలతో కెరియర్ మొదలు పెట్టిన మంగ్లీ.. వీ6 టీవీ ఛానల్‌లో ప్రసారమయ్యే తీన్మార్ పొగ్రాంతో మీడియా ప్రపంచంలో అడుగుపెట్టి ప్రజలకు పరిచయమైంది. అయితే, మంగ్లీ యాస భాష చూసి… అందరూ తను తెలంగాణకు చెందిన వ్యక్తిగా అనుకుంటారు.

ఒకసారి వీ6 టీవీ ఛానెల్‌లో జానపద కార్యక్రమం జరుగుతుండగా… బిక్షు నాయక్ అనే జానపద గాయకుడు మంగ్లీని అక్కడికి పంపించాడు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆ ఛానెల్ నుంచి వచ్చిన ఆఫర్‌ను అందుకుని… యాంకర్ అయ్యారు. ‘సత్యవతి ‘ పేరుకన్నా ఇంకేదైనా పేరు పెట్టుకోమని… కోరగా… మంగ్లీ అనే తన తాతమ్మ పేరునే ఎంచుకుంది. ఆ పేరుతోనే ‘మాటకారి మంగ్లీ’ అనే కార్యక్రమం మొదలైంది. ఆ తర్వాత చేసిన ‘తీన్మార్ ‘ తీన్మార్ న్యూస్ ‘ తో మంగ్లీ పేరు తెలంగాణా లోని గడప గడపకీ చేరింది. అప్పుడే ఎంటర్ టైన్మెంట్ యాంకర్ గా నేషనల్ టీవీ అవార్డు గెలుచుకుంది.

కానీ, ఇంత పేరు వచ్చినా తనకు ఇష్టమైన సంగీతానికి దూరమవుతున్నానన్న బాధ మంగ్లీలో వుండేది. అందుకే టీవీ నుంచి బయటకొచ్చి ‘మైక్’టీవీ యూట్యూబ్ ఛానల్‌లో చేరింది. అప్పుడే తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా పాడిన “రేలా……రేలా….రే.” పాట మంగ్లీని సెలబ్రటీ సింగర్‌గా నిలబెట్టింది. ఆ తర్వాత సినిమా పాటల రచయిత కాసర్ల శ్యాం ద్వారా సినిమా పాటలు కూడా పాడారు. అలా సినిమాల్లో పాటలు పాడిన మంగ్లీ… లంబాడా ఆడ పిల్లల్ని కాపాడుకోవాలంటూ సందేశమిచ్చే ‘గోర్ జీవన్’ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. ఇక… 2020 మార్చి 8న తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.

మంగ్లీ పాడిన పాటల జాబితా…
2018 మైక్ టీవీ బతుకమ్మ పాట
2018 మైక్ టీవీ గణేశ్ చతుర్థి
2018 ఆదిత్య మ్యూజిక్ చూడే (శైలజారెడ్డి అల్లుడు సినిమా)
2018 మైక్ టీవీ బోనాలు పాట
2018 RTV బంజారా బంజారా తీజ్ పాట (గూగర బండలేనా)
2018 మైక్ టీవీ తెలంగాణ స్థాపక దినోత్సవం పాట
2018 మైక్ టీవీ కేసీఆర్ పాట
2018 మైక్ టీవీ ఉగాది పాట
2018 RTV బంజారా బంజారా పాట (బాపు వీరన్న కురవి వీరన్న)
2018 మైక్ టీవీ సమ్మక్క-సారక్క
2018 మైక్ టీవీ సంక్రాంతి పాట
2018 మ్యాంగో మ్యూజిక్ పార్వతి తనయుడవో (నీదీ నాదీ ఒకే కథ సినిమా)
2017 మైక్ టీవీ తెలుగు మహాసభలు బతుకమ్మ పాట
2017 ఐ డ్రీమ్ బతుకమ్మ పాట
2017 తెలుగు వన్ ప్రత్యేక బతుకమ్మ పాట
2017 మైక్ టీవీ బతుకమ్మ పాట
2017 ఫ్యూచర్ ఫిల్స్మ్ అమ్మవా రాతిబొమ్మవా
2017 మైక్ టీవీ రేలా రే రేలా రే

తెలుగు ప్రజల్లో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సింగర్ సత్యవతి మంగ్లీకి జన్మదిన శుభాకాంక్షలుతో….

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *