ఏపీలో కొత్తగా 425 కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 425 కరోనా కేసులు.. రెండు మరణాలు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి సంబంధించినవి 299 కేసులు కాగా.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 126 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,496కి చేరింది. మొత్తం 13,923 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 92గా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *