యూత్‌లో కాజల్‌ అగర్వాల్‌కు తిరుగులేని క్రేజ్‌…

టాలివుడ్‌లో తిరుగులేని స్టార్‌డమ్‌, యూత్‌లో ఫాలోయింగ్‌ను సంపాదించిన హీరోయిన్లలో కాజల్‌ అగర్వాల్‌ ఒకరు. స్వతహాగా మోడల్‌ అయిన ఈ ముంబయ్‌ భామ 2004లో ఓ హిందీ సినిమాలో చిన్న క్యారెక్టర్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2007లో కల్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన లక్ష్మీకల్యాణం సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైంది. చందమామ సినిమాతో తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 2009లో రాజమౌళి దర్శకత్వంలో నటించిన మగధీర ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాకు కాజల్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకుంది. అనతి కాలంలోనే పెద్ద హీరోలు, డైరెక్టర్లతో సినిమాలు చేసింది. తెలుగుతో పాటు తమిళ్‌, హిందీ, భాషల్లో పలు విజయవంతమైన సినిమాల్లో నటించింది. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా వస్తున్న మోసగాళ్లు సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. శుక్రవారం కాజల్‌ జన్మదినం సందర్భంగా ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు, నటులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

‘అందమైన, బలమైన, స్వతంత్ర భావాలు కలిగిన కాజల్‌ అగర్వాల్‌కు జన్మదిన శుభాకాంక్షలు’ అని నటి సమంత ట్వీట్‌ చేసింది. ‘హృదయ ఆకారపు కళ్లతో నవ్వుతున్న ముఖం.. హ్యాపీ బర్త్‌డే కాజు’అని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పోస్టు చేసింది. ‘కష్టపడి పనిచేసే తత్వం కలిగిన స్నేహితురాలు, మంచి నటికి జన్మదిన శుభాకాంక్షలు‘ అని తమన్నా ట్వీట్‌ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *