చైనాతో సరిహద్దులో ఉద్రికత్తల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు తమ స్మార్ట్‌ఫోన్‌‌లో చైనా మూలాలున్న 52యాప్‌లు వెంటనే తొలగించాలని ఎస్టీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆదేశించారు. ఈ యాప్‌ల వినియోగంతో ఫోన్‌లోని డాటా అపహరణకు గురయ్యే అవకాశముందని కేంద్రం హోంశాఖ సూచించిందని పేర్కొన్నారు. ఈ యాప్‌ల జాబితాలో టిక్‌టాక్‌, వాల్యూట్‌ హైడ్‌, వీబో, వీ చాట్‌, షేరిట్‌, యూసీ న్కూస్‌, బ్యూటీ ప్లస్‌, క్లబ్‌ ఫ్యాక్టరీ, హలో, లైక్‌, క్వై అండ్‌ రోమీ ఉన్నట్లు వెల్లడించారు. త్వరలో చైనా వస్తువులను బహిష్కరించాలంటూ పిలుపు రానుందని పేర్కొన్నారు. కాగా ఇటీవల గాల్వాన్‌ లోయలో చైనా దళాలకు భారత జవాన్లుకు నడుమ జరిగిన ఘర్షణలో 20మంది భారత జవాన్లతోపాటు ఓ కల్నల్‌ ర్యాంకు అధికారి వీర మరణం పొందిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *