తెలంగాణలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే 499 కేసులు వెలుగుచూశాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 329 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో మరో 129 కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,526కి చేరింది. గడిచిన 24 గంటల్లో మరో మూడు మరణాలు సంభవించాయి. దీంతో మరణాల సంఖ్య 198కి చేరిందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
ఇవాళ మొత్తం 2,477 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో 1,978 మందికి నెగిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 50,569 మంది పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంది. మరో 51 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3,352కి పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,976 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు..