మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల పెళ్లి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తనకు పెళ్లి కుదిరిందని నిహారిక సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా వెల్లడించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆమెపై పడింది. ఇక కాబోయే భర్త ఫొటో రివీల్ చేయడంతో సోషల్ మీడియాలో వీరి ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు నిహారిక పెళ్లివెనకాల పెద్ద స్టోరీ ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. నిహారిక పెళ్లి సెట్ చేసింది మెగాస్టారేనట. . చిరు నిహారికని సొంత కూతురులానే చూస్తారు. అందుకే నిహారిక పెళ్లి బాధ్యతలు కూడా తీసుకొని ఈ పెళ్లి సెట్ చేసాడట.అప్పట్లో చిరంజీవి జొన్నలగడ్డ కుటుంబంతో బంధం కలుపుకోవాలని చూశాడు.. కానీ కుదరలేదు.

చైతన్య జొన్నలగడ్డ తండ్రి జొన్నలగడ్డ ప్రభాకర్ గుంటూరు ఐజిగా పని చేస్తున్నారు. ఆ కుటుంబంతో వియ్యం పొందాలని 30 సంవత్సరాల క్రితం చిరంజీవి ప్రయత్నించాడు. నిజానికి నిహారికకు కాబోయే భర్త చైతన్య తల్లి జె.పద్మ తండ్రి గుణ వెంకటరత్నం.. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు అప్పట్లో మంచి స్నేహితులట. వీరిద్దరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడం వలన పద్మ పెళ్ళైన నాటి నుంచే చిరంజీవికి చైతన్య ఫాదర్ ప్రభాకర్ రావు మధ్య మంచి స్నేహం కుదిరింది. ఆ తర్వాత ప్రభాకర్ చెల్లెలు పద్మతో నాగబాబు పెళ్లి చేయాలని అప్పట్లో చిరంజీవి ప్రయత్నించినా కూడా అది ఎందుకో కుదరలేదు. దాంతో మళ్లీ ఇప్పుడు చిరంజీవి చొరవ తీసుకొని తన కూతురు నిహారిక విషయంలో ఈ సంబంధం సెట్ చేశాడని ప్రచారం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *