వీరిలో మీకు గర్ల్‌ఫ్రెండ్‌గా ఎవరిని సెలక్ట్ చేసుకుంటారు..!

లాక్‌డౌన్ వేళ ఇంటికి పరిమితమైన క్రీడా ప్రముఖులు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌కి దగ్గరగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారు చేసే ఎంజాయ్‌ను అప్పుడప్పుడు నెటిజన్లతో షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మాజీ టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ జెండర్- స్వాప్ ఫేస్ యాప్‌తో పలువురు టీమిండియా క్రికెటర్లను అమ్మాయిలుగా మార్చిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. దానికి వీరిలో గర్ల్‌ఫ్రెండ్‌గా మీరు ఎవరిని ఎంచుకుంటారు..? నా సమాధానం రేపు చెప్తానని తెలిపారు. ఇక ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. చాలామంది బౌలర్ భువనేశ్వర్ కుమార్ పేరు చెబుతున్నారు. హర్భజన్ సింగ్ నా స్నేహితురాలుగా భువీని ఎంచుకుంటాను అని కామెంట్ చేయగా.. ఆశిష్ నెహ్రా భార్య రష్మా కూడా భువీ పేరునే చెప్పింది. మరికొందరు జడేజా, రహానే, కోహ్లీ, ధోని పేర్లు చెబుతున్నారు. కాగా యుజువేంద్ర చాహల్ సైతం ఇటీవల రోహిత్ శర్మ ఫొటోను అమ్మాయిగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *