పది బీర్లు తాగి పడుకున్నాడు.. లేచి చూసే సరికి

ప్రపంచంలో మంచినీళ్ల తరువాత అత్యధిక మంది తాగే పానీయం బీరు.   బీరుకు ప్రపంచంలో మంచి డిమాండ్ ఉన్నది.   మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా, బీరు తాగకుండా ప్రపంచం ఒక్కరోజు కూడా బతకలేదు.  ప్రభుత్వానికి ఆదాయవనరు కూడా ఇదే.

కొంతమంది యువకులు సరదాగా పందెం వేసుకుంటూ ఉంటారు.  ఆపకుండా 10,20 బీర్లు తాగుతామని అంటున్నారు.  చైనాకు చెందిన ఓ యువకుడు కూడా ఇలానే పందెం వేసి 10 బీర్లు తాగేశాడు.  ఆ మత్తులో తెలియకుండా దాదాపుగా 18 గంటలు నిద్రపోయాడు.  మధ్యలో అస్సలు లేవలేదు.  బీరులో నీరు ఎక్కువగా ఉంటుంది.  అంతేకాదు, బ్లాడర్ ను క్లీన్ క్లీన్ చేసే తత్త్వం ఉంటుంది.  అందుకే బీర్ తాగిన వ్యక్తులు పదేపదే మూత్ర విసర్జనకు వెళ్తుంటారు.  కానీ, ఈ యువకుడు 18 గంటలపాటు నిద్రపోవడంతో మూత్ర విసర్జనకు వెళ్ళలేదు.  లేచిన తరువాత పొత్తికడుపులో విపరీతమైన నొప్పిగా ఉండటంతో వెంటనే ఆసుపత్రికి వెళ్ళాడు.  వైద్యులు అతడిని పరీక్షించి షాక్ అయ్యారు.  బ్లాడర్ లో పగుళ్లు ఏర్పడ్డాయి.  వెంటనే చిన్నపాటి చికిత్స చేసి సరిచేశారు. పగుళ్లు చిన్నవి కావడంతో బతికి బయటపడ్డాడు.  లేదంటే పెద్ద ప్రమాదం జరిగుండేది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *