దక్షిణాది తారలంటే అక్కడ చిన్నచూపు…

బాలీవుడ్‌తో పోలిస్తే, దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో మహిళా నటీమణులకు గౌరవం ఎక్కువగా ఉంటుందని నటి పాయల్‌ఘోష్‌ చెప్పుకొచ్చింది. తెలుగులో ‘ప్రయాణం’, ‘ఊసరవెల్లి’ తదితర చిత్రాల్లో నటించిన ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌లో అవకాశాలు వెతుక్కుంటోంది.

‘‘జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న దక్షిణాది దర్శకులతో నేను పనిచేశా. షూటింగ్‌ సమయంలో అక్కడి తారలు, దర్శకులతో ఎలాంటి సమస్య ఉండేది కాదు. ఇది నిజం. వాళ్లు కథానాయికలను దేవతల్లా చూస్తారు. తమిళనాడులో కథానాయికలకు గుళ్లు కట్టిన విషయం అందరికీ తెలిసిందే కదా! బాలీవుడ్‌లో పనిచేయడానికి వస్తే, ‘దక్షిణాది చిత్రాల్లో పనిచేశానని చెప్పకు’ అంటూ చాలామంది సలహా ఇచ్చేవారు. ఎందుకంటే ఇక్కడ అపార్థం చేసుకుంటారట. దక్షిణాది తారలంటే ఇక్కడ చిన్నచూపు’’ అని పాయల్‌ తెలిపింది.

‘‘దక్షిణాది చిత్రాల్లో నటించిన నా కెరీర్‌ను ఎందుకు పాడు చేసుకోవాలి’ అనిచాలామంది నాతో అనేవారు. ఇప్పుడు నాకు అనిపిస్తోంది. బాలీవుడ్‌పై దృష్టి పెట్టే కన్నా, దక్షిణాది చిత్రాలపై ఎందుకు దృష్టిసారించకూడదని ఇప్పుడు నాకు అనిపిస్తోంది. పెద్ద బ్యానర్‌లో నటించడం ఆ సినిమా హిట్‌ కావడం ప్రతిసారి సాధ్యం కాకపోవచ్చు. కానీ, నాకు ఏ సినిమాలో అవకాశం వచ్చినా దాన్ని వదులుకోను, అప్పుడు నేను కాదు, నా నటన మాట్లాడుతుంది’’ అని పాయల్‌ చెప్పుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *