తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. మహమ్మారి ఉధృతి రోజు రోజుకూ పెరుగుతోంది. లాక్‌డౌన్ టైంలో నిదానంగా స్ప్రెడ్ అయిన వైరస్… అన్‌లాక్ ప్రక్రియ మొదలైన నాటి నుంచి స్పీడ్ పెంచింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. రాష్ట్రంలో  గురువారం ఒక్కరోజే 920 పాజిటివ్‌ కేసులు నమోదవ్వడంతో 11వేల మార్కును దాటేసింది. ఇప్పటిదాకా ఒక్కరోజు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. గురువారం 3616 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 2696 నెగెటివ్‌గా తేలగా.. 920 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 737 కరోనా కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రోజు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్‌ జిల్లాలో 60, కరీంనగర్‌లో 13 చొప్పున నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,364కి పెరిగింది.

కొత్తగా మరో ఐదు మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 230కి చేరింది. రాష్ట్రంలో ఈ రోజు మరో 327మంది కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జిల సంఖ్య 4688కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6446 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *