ఆషాడం తర్వాత టాలీవుడ్ బ్యాచిల‌ర్ పెళ్లి…!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ నితిన్ త‌న ప్రేయ‌సి శాలినితో ఏప్రిల్ 16న పెళ్ళి పీట‌లెక్కేందుకు సిద్ద‌మ‌య్యాడు. కాని క‌రోనా వారి పెళ్లికి బ్రేక్ వేసింది. దుబాయ్‌లో డెస్టినేష‌న్ మ్యారేజ్ చేసుకోవాల‌నుకున్న నితిన్ క‌రోనా వ‌ల‌న త‌న పెళ్లికి తాత్కాలిక బ్రేక్ వేశాడు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఆషాడం త‌ర్వాత నితిన్ తను ప్రేమించిన శాలినితో క‌లిసి ఏడ‌డుగులు వేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

క‌రోనా విజృంభ‌ణ ఇప్ప‌ట్లో త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. దీంతో నితిన్ పెళ్లిని ఆషాడం పూర్తి అయిన వెంటనే జరిపేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం. హైదరాబాద్ శివారులో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో పెళ్లికి సిద్దం అవుతున్నారు. అతి కొద్ది మంది బంధు మిత్రులను ఈ పెళ్లికి నితిన్ అండ్ ఫ్యామిలీ ఆహ్వానించబోతున్నారు. జులై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో నితిన్ షాలినిల వివాహం జరిగే అవకాశం ఉందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *