వినోద రంగానికి ఈ ఏడాది ఏమంత ఆశాజనకంగా లేదు సరికదా, అనేక విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం ఇప్పటికీ బాధిస్తూనే ఉంది. తాజాగా, ఢిల్లీకి చెందిన ఓ టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆమె పేరు సియా కక్కర్. వయసు 16 ఏళ్లు. దీనిపై ఆమె మేనేజర్ అర్జున్ సరిన్ మాట్లాడుతూ…. సియాతో ఓ కొత్త పాట గురించి తాను గతరాత్రే చర్చించానని తెలిపారు. ఆమె ఎంతో ఉత్సాహం ప్రదర్శించిందని, కానీ ఇవాళ ఈ ఘటన జరగడం నిర్ఘాంతపరిచిందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సియా కక్కర్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *