సరిగ్గా రెండేళ్ళ నాడు శబరిమల ఆలయ ప్రవేశానికి ప్రయత్నించి సంచలనం సృష్టించిన కేరళకు చెందిన రెహనా ఫాతిమా మరో మారు చర్చనీయాంశంగా మారింది. సామాజిక కార్యకర్తనంటూ శబరిమల ఆలయ ప్రవేశానికి ప్రయత్నించింది ఆమె. అయితే అప్పుడే ఆమె మీద రకరకాల కేసులు నమోదయ్యి ఉద్యోగం పోగొట్టుకునే దాకా వెళ్ళింది. తాజాగా ఆమె పై కేరళ పోలీసులు కేసు నమోదు చేయటం సంచలనంగా మారింది.

ఆమె మీద నమోదయిన కేసు అల్లాటప్పా కేసు కాదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67, జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 75, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. దానికి కారణం ఆమె అర్థనగ్నంగా చిన్నపిల్లలతో తన శరీరంపై పెయింటింగ్ వేయించుకోవటం. చిన్నారులతో తన శరీరంపై పెయింటింగ్ వేయించుకోవటమే కాకుండా దానిని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయటం తాజా వివాదానికి కారణమైంది. ఆ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేయడంతో రెహనా ఫాతిమాపై కేరళ ప్రజలు భగ్గుమంటున్నారు.

అయితే దీనిని కళాత్మక దృష్టితో చూడాలని రెహనా ఫాతిమా అంటున్నా.. అర్థనగ్నంగా చిన్నపిల్లలతో ఆ పాడుపనులేంటని భారీ ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వీడియో పోస్ట్ చేసేప్పుడు ఆమె “అమ్మ శరీరాన్ని నగ్నంగా చూడని మగపిల్లలు స్త్రీ దేహాన్ని తప్పుగా ఆలోచించచ్చు..ఆడవారి మీద తప్పుడు ఆలోచనలను కట్టడి చేసే వాక్సిన్ మన ఇంటి నుండే మొదలవ్వాల”ని పేర్కొన్నారు. ఇక నిన్న జరిగిన రైడ్ లో పోలీసులు ఆమె ఇంట్లో ఈ వీడియో తీసేందుకు వాడిన ఫోన్, అప్లోడ్ చేసిన లాప్టాప్ ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ హక్కుల కార్యకర్త అజ్ఞాతంలో ఉంది.

Video:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *