అభం శుభం తెలియని 13 ఏండ్ల బాలిక. ఒక ఎగ్జిబిషన్‌లో పాల్గొనడానికి ఊరుకాని ఊరుకు వెళ్లింది. ఇంతలో కరోనా లాక్‌డౌన్‌ వచ్చిపడింది. ఊరికి తిరిగి వెళ్లాడానికి బస్టాండ్‌కు వచ్చింది. బస్సులు నడవడంలేదని తెలియడంతో బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉంది. ఏవైనా వాహనాలు వస్తాయేమో అని ఎదురుచూస్తూ ఉంది. ఇంతలో ఓ వాహనం వచ్చింది. కానీ అది పోలీస్‌ పెట్రోలింగ్‌ జీప్‌. హమ్మయ్య బతికిపోయాను అనుకుంది ఆ బాలిక. ఆమెను స్టేషన్‌కు తీసుకువెళ్లి ఇన్‌స్టెక్టర్‌తోసహా ఇతర సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు… తమకు కావాల్సినప్పుడుల్లా స్టేషన్‌కు పిలిపించుకుని మరీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఒడిశాలోని గిరిజన ప్రాబల్య ప్రాంతమైన సుందర్‌ఘర్‌ జిల్లాలోని బిరమిత్రాపూర్‌లో మార్చి 25న చోటుచేసుకుంది. ఈ అఘాయిత్యం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అత్యాచారానికి పాల్పడి ఇన్‌స్పెక్టర్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు.

మార్చి 25 బిరమిత్రాపూర్‌లో జరగనున్న ఒక ఫెయిర్‌లో పాల్గొనడానికి 13 ఏండ్ల బాలిక వచ్చింది. అయితే అది లాక్‌డౌన్‌ కారణంగా చివరిక్షణంలో రద్దయింది. ఈ విషయం తెలుకుని ఇంటికి తిరిగి వెల్లడానికి బస్‌స్టాండ్‌కు చేరుకుంది. బస్సులు లేకపోవడంతో అక్కడే ఉండిపోయింది. బస్టాండ్‌ వద్ద తిరుగుతున్న ఆమె పెట్రోలింగ్‌ పోలీసులు బిరమిత్రాపూర్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. రాత్రి పూట స్టేషన్‌లో ఆ బాలిక ఒక్కతే ఉండటంతో ఇన్‌చార్చి ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్‌ చంద్ర మాఝీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు ఆమెను తన ఇంట్లో వదిలేశాడు.

అక్కడితో వదిలేయకుండా తరచూ ఆ అమ్మాయిని పోలీస్‌స్టేషన్‌కు పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇన్‌స్పెక్టతోపాటు, మరికొంతమంది పోలీసులు కూడా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. దీంతో ఆమె గర్భవతి అయ్యింది. విషయం బయటికి పొక్కకుండా ఆమెకు గర్భస్రావం చేయించడానికి ప్రయత్నించాడు. అయితే ఈ విషయం గురించి తెలుసుకున్న సుందర్‌భాగ్‌ జిల్లా శిశు సంరక్షణ అధికారి ఎస్‌ జెనా ఇన్‌స్పెక్టర్‌తోపాటు, పోలీసు సిబ్బంది, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో అబార్షన్ చేసిన డాక్టర్‌… బాలిక సవతి తండ్రి, మరో ఇద్దరిపై రైబోగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశామని, ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్‌ చంద్రను సస్పెండ్‌ చేస్తున్నట్లు జలాన్‌ డీఐజీ కవిత తెలిపారు.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *