ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వ‌కీల్‌సాబ్‌’. బాలీవుడ్ చిత్రం ‘పింక్‌’కు ఇది రీమేక్‌. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌కుడు. అంజ‌లి, నివేదా థామ‌స్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే 80 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం క‌రోనా ప్ర‌భావంతో ఆగింది. ప‌రిస్థితులు చూస్తుంటే ఆగ‌స్ట్‌లో సినిమా షూటింగ్ మొద‌ల‌య్యేలానే క‌న‌ప‌డుతుంది. క‌రోనాతో పాటు ఈ సినిమాను లీకుల స‌మ‌స్య కూడా వేధిస్తుంది. సినిమా స్టార్టింగ్ రోజునే ప‌వ‌న్ క‌ల్యాణ్ లుక్ లీక్ అయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మ‌రో షూటింగ్ లొకేష‌న్ ఫొటో లీకైంది. సినిమాలో కీల‌క‌మైన ఇన్‌టెన్స్ కోర్ట్ సీన్.. అందులో ప‌వ‌న్‌క‌ల్యాణ్, అంజ‌లి ఉన్న ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. మ‌రి ఈ లీకుల స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌టానికి నిర్మాత‌లు బోనీక‌పూర్‌, దిల్‌రాజు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *