ఓ గ‌ర్భిణికి నెల‌లు నిండాయి. ఆమెకు పురిటి నొప్పులు రావ‌డంతో.. ఇంట్లోనే సుఖ ప్ర‌స‌వం జ‌రిగింది. కానీ పుట్టిన బిడ్డ‌ను చూసి అంద‌రూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ ప‌సిపాప‌కు చేతులు, కాళ్లు లేవు. ఈ అరుదైన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ సిరోంజ్ లోని స‌కా గ్రామంలో చోటు చేసుకుంది.

ఓ 28 ఏళ్ల మ‌హిళ‌కు జూన్ రెండో వారంలో నెల‌లు నిండాయి. దీంతో జూన్ 26వ తేదీన ఆమెకు పురిటి నొప్పులు వ‌చ్చాయి. ఇంట్లోనే పండంటి బిడ్డ‌కు ఆమె జ‌న్మ‌నిచ్చింది. కానీ ఆ ప‌సిపాప‌ను చూసి కుటుంబ స‌భ్యులు షాక్ అయ్యారు. ఆ ప‌సిగుడ్డు కాళ్లు, చేతులు లేకుండానే పుట్టింది. దీంతో ఆ చిన్నారిని రాజీవ్ గాంధీ స్మృతి ఆస్ప‌త్రికి తీసుకెళ్లి డాక్ట‌ర్ల‌కు చూపించారు.

ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్లు మాట్లాడుతూ.. ఆటోసోమ‌ల్ రిసెసివ్ అనే రుగ్మ‌త వ‌ల్ల పిల్ల‌లు ఈ విధంగా జ‌న్మిస్తార‌ని తెలిపారు. ఇలా పిల్ల‌లు జ‌న్మించ‌డాన్ని టెట్రా అమెలియా అని అంటార‌ని చెప్పారు. ఈ స‌మ‌స్య త‌ప్ప బిడ్డ‌లో ఎలాంటి ఇత‌ర స‌మ‌స్య‌లు లేవ‌ని వైద్యులు స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి ల‌క్ష మంది శిశువుల్లో ఒక‌రు ఈ స‌మ‌స్య‌తో పుడుతార‌ని భోపాల్ సీఎంహెచ్వో, పిల్ల‌ల డాక్ట‌ర్ ప్ర‌భాక‌ర్ తివారి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *