గోదావ‌రిఖ‌ని 2టౌన్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఓ యువ‌కుడు.. గోదావ‌రి న‌దిలోకి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు య‌త్నించాడు. యువ‌కుడి ప్ర‌య‌త్నాన్ని ప‌సిగ‌ట్టిన గోదావ‌రిఖ‌ని రివ‌ర్ పోలీసులు అత‌డిని ప్రాణాలతో కాపాడారు. ఎన్టీపీసీలోని అన్న‌పూర్ణ కాల‌నీకి చెందిన‌ మెరుగు విజ‌య్(30) అనే యువ‌కుడిని కుటుంబ స‌మ‌స్య‌లు వేధిస్తున్నాయి. దీంతో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నాడు.

ఇక సోమ‌వారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు గోదావ‌రి బ్రిడ్జి వ‌ద్ద‌కు చేరుకున్న అత‌ను అనుమానాస్ప‌ద స్థితిలో తిరుగుతూ పోలీసుల‌కు క‌నిపించాడు. పోలీసులు అత‌న్ని ఫాలో అయ్యారు. ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నిస్తున్న విజ‌య్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత‌ని కుటుంబ స‌భ్యుల‌ను పోలీసులు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంత‌రం విజ‌య్ ను కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *