బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా కీలక నిర్ణ‌యం తీసుకుంది. 20 సంవ‌త్స‌రాల కెరీర్‌లో 60 సినిమాల త‌ర్వాత తొలిసారి గ్లోబ‌ల్ టెలివిజ‌న్‌ అమెజాన్ ప్రైమ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మల్టీ మిలియన్ డాలర్లతో రెండు సంవత్సరాలకు కుదుర్చుకున్న ఈ డీల్ ప్రియాంకా చోప్రాకు మొట్టమొదటి టెలివిజన్ డీల్ కావటం విశేషం. దీనికి సంబంధించి ప్రియాంకా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

అమెజాన్ ప్రైమ్‌తో డీల్ ఒప్పందం గురించి మాట్లాడిన ప్రియాంక‌.. ఇన్నాళ్ళు సినిమా న‌టిగా న‌న్ను ఎంత‌గానో ఆద‌రించారు. ఇప్పుడు టెలివిజ‌న్‌కి ప‌రిచ‌యం కాబోతున్నాను. అమెజాన్‌తో కుదిరిన ఒప్పందం నాకు సంతోషాన్ని క‌లిగిస్తుంది.  ప్ర‌పంచానికి బ్రాండ్ లాంటి అమెజాన్‌తో క‌లిసి ప‌ని చేయ‌టం గ‌ర్వంగా ఉంది. కొత్త ప్ర‌య‌త్నానికి ఇది పునాది. హిందీ, ఇంగ్లీష్ భాష‌ల‌లో నేను కంఫ‌ర్ట్‌బుల్‌గా ప‌ని చేయ‌గ‌ల‌ను. న‌చ్చిన భాష‌లో ఎంతో ఆత్మ‌విశ్వాసంతో ప‌ని చేయ‌గ‌లం అని ప్రియాంక పేర్కొంది.

ఎంతో ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో ఇండస్ట్రీలో సక్సెస్ ను సాధించానని తెలిపిన ప్రియాంక చోప్రా .. ఇప్పుడు అమెజాన్ తో డీల్ కుదుర్చుకునే అవకాశం రావటం కూడా తన కెరీర్ లో చాలా పెద్ద ఎచీవ్ మెంట్ అని అన్నారు. ఇక అమెజాన్ స్టూడియోస్ హెడ్ జెన్నిఫర్ సాల్కే మాట్లాడుతూ.. “ప్రియాంకకు మంచి ప్రతిభ ఉన్న వ్యక్తి . విభిన్న వరల్డ్ స్టోరీల పట్ల మంచి అభిరుచి ఉంది. ప్రియాంకతో మా ఒప్పందం చాలా సంతోషంగా ఉంది.కంటెంట్ ను చక్కగా ప్రజెంట్ చేయగల సత్తా ఆమెకు ఉందని ఆమెతో మా ప్రయాణం మాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

ప్ర‌స్తుతం ప్రియాంక రెండు క్రేజీ ప్రాజెక్టులు చేస్తుంది. ఇందులో ఒక‌టి డ్యాన్స్ షో. దీనిని త‌న భ‌ర్త నిక్ జోనాస్‌తో క‌లిసి నిర్మిస్తుంది. త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో జ‌రిగిన సంగీత్‌, వ‌ధూవ‌రుల కుటుంబాలు ట్రోఫీ కోసం పోటీ ప‌డే గేమ్స్ వంటి వాటిని ప్రేర‌ణ‌గా తీసుకొని షో చేస్తుంది. మ‌రోవైపు ఆంథోనీ మరియు జో రస్సో యొక్క సిటాడెల్.  ఇది గూఢాచారి నాటకం. ఇందులో ప్రియాంక‌ గేమ్ ఆఫ్ థ్రోన్స్స్‌, బాడీగార్డ్ ఫేం రిచర్డ్ మాడెన్‌తో కలిసి నటించనుంది.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *