ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా.. రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. శనివారం ఆమెకు తలనొప్పి, గొంతు నొప్పి రావడంతో అనుమానం వచ్చి.. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దానికి సంబంధించి రిపోర్ట్ సోమవారం రాగా.. అందులో కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు డాక్ట‌ర్లు. ప్రస్తుతం సుమలత హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. డాక్టర్ సలహాతో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు.

ప్రజలందరి ఆశీర్వాదంతో..త్వరలోనే కరోనా నుంచి బయటపడతానని ఆమె చెప్పారు. ఇటీవల తాను కలిసిన వారందరి వివరాలను అధికారులు వెల్లడంచానని తెలిపారు. వారంతా వీలైనంత త్వరగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం భాషల్లో పలు సినిమాల్లో నటించిన సుమలత .. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్యా లోక్ సభ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించిన విస‌యం తెలిసిందే.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *