గాల్వన్ లోయలో భారతీయ సైనికులతో ఘర్షణ జరిగిన ప్రాంతం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరం చైనా దళాలు వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. వివాదాస్పదంగా మారిన ప్రాంతం నుంచి రెండు దేశాలు తాత్కాలిక నిర్మాణాలను తొలగించినట్లు అధికార వర్గాల ద్వారా వెల్లడైంది. జూన్ 15వ తేదీన ఎక్కడైతే ఘర్షణ జరిగిందో.. ఆ కీలక ప్రాంతం నుంచి చైనా దళాలు ఉపసంహరించినట్లు తెలుస్తోంది. 20 మంది సైనికులు చనిపోయిన ప్రదేశం వద్ద భారత్ .. ఇటీవల భారీగా బలగాలను మోహరించింది. బంకర్లు, తాత్కాలిక టెంట్లను నిర్మించింది. ఓ దశలో రెండు దేశాల సైనికులు.. ఎదురెదురుగా యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా ఉత్కంఠ నెలకొన్నది.

జూన్ 30వ తేదీన జరిగిన కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల ఒప్పందం ప్రకారం గాల్వన్ లోయ వద్ద సర్వే చేపట్టారు. ఒప్పందాలకు తగినట్లు చైనా వెనక్కి తగ్గిందా లేదా అన్న సర్వే జరిగినట్లు తెలుస్తోంది. ఉద్రిక్తంగా ఉన్న గాల్వన్‌, పాన్‌గాంగ్ సో, హాట్ స్ప్రింగ్స్ ప్రదేశాల నుంచి సైనికులను వెనక్కి పంపాలని జూన్ 30వ తేదీన ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండు దేశాలకు చెందిన ప్రత్యేక ప్రతినిధులు మరోసారి వివాదాస్పద అంశాల గురించి చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరిహద్దు వివాదాన్ని సామరస్య పూర్వకంగానే పరిష్కరించాలని రెండు దేశాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

2 Comments

  1. Utilize gradual vascular eradication after you take the healthcare practitionerРІs hypertension to maintain normal patients. sildenafil prices Cgomgz qrcasn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *