దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్ బీఐ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. నగదు విత్ డ్రాలకు సంబంధించి సరికొత్త రూల్స్ ప్రకటించింది. బ్యాంకు, ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణకు సంబంధించి అనేక మార్పులు చేసింది. నగదు విత్ డ్రాల సంఖ్యపై పరిమితులు విధించిన ఎస్ బీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పై మాత్రం కరుణ చూపింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అపరిమిత లావాదేవీలకు అనుమతి ఇచ్చింది. ఇందుకు ఎలాంటి రుసుం అవసరంలేదని పేర్కొంది. అంతేకాదు, సేవింగ్స్ ఖాతాల వడ్డీరేటులో 5 బేసిస్ పాయింట్ల కోత విధించింది. తద్వారా మే 31 నుంచి 2.7 వడ్డీ శాతం వర్తింపచేయనున్నారు.

ఎస్ బీఐ కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకు శాఖ నుంచి విత్ డ్రా చేసుకునే వారికి..

  • బ్యాంకు ఖాతాలో సగటు నెలవారీ మొత్తం రూ.25 వేల వరకు ఉండే ఖాతాదారుడు బ్యాంకు శాఖ నుంచి ఒక నెలలో రెండు సార్లు మాత్రమే నగదు విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది.
  • సగటు నెలవారీ మొత్తం రూ.25,000 నుంచి రూ.50,000 వరకు ఉంటే 10 విత్ డ్రాయల్స్ ఉచితం.
  • నగదు ఉపసంహరణలకు పరిమితి దాటిని వారు ప్రతి లావాదేవీకి రూ.50కి తోడు అదనంంగా జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.
  • సగటు నెలవారీ మొత్తం రూ.50,000 నుంచి రూ.1,00,000 వరకు ఉంటే అపరిమిత సంఖ్యలో ఎన్నిసార్లయినా విత్ డ్రా చేసుకోవచ్చు.

ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకునే వారికి…

  • సగటు నెలవారీ మొత్తం రూ.25,000 లోపు ఉంటే ఓ ఖాతాదారుడు 8 సార్లు (ఎస్ బీఐలో 5 సార్లు ఇతర బ్యాంకుల్లో 3 సార్లు) ఉచితంగా నగదు తీసుకోవచ్చు. ఈ సౌకర్యం 6 మెట్రో నగరాలకే పరిమితం చేశారు. ఇతర నగరాల్లో మాత్రం 10 ఉచిత అవకాశాలు ఇచ్చారు. ఎస్ బీఐ ఏటీఎంలలో 5, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో 5 అవకాశాలు ఉపయోగించుకోవచ్చు.
  • సగటు నెలవారీ మొత్తం రూ.25 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉన్న ఖతాదారులు ఎస్ బీఐ ఏటీఎంలలో ఉచితంగా ఎన్నిసార్లయినా నగదు తీసుకోవచ్చు. ఇతర బ్యాంకు ఏటీఎంలలో 8 సార్లు (మెట్రో సిటీల్లో 3 సార్లు, నాన్ మెట్రో నగరాల్లో 5 సార్లు) తీసుకోవచ్చు.
  • నిర్దేశించిన పరిమితికి మించి ఏటీఎంల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే ఒక్కో ట్రాన్సాక్షన్ కు రూ.10 నుంచి రూ.20 వరకు జీఎస్టీ సహిత రుసుం వసూలు చేస్తారు.

 

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *