కాన్పూర్‌లో గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే జరిపిన కాల్పుల్లో మరణించిన 8 మంది పోలీసుల్లో ఒకరైన కానిస్టేబుల్ సుల్తాన్ సింగ్ కుటుంబాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి రామ్ నరేష్ అగ్నిహోత్రి మంగళవారం పరామర్శించారు. ఝాన్సీలోని కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటంపై పూలు చల్లి నివాళి అర్పించారు. అనంతరం ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి పరిహారం చెక్కును భార్యకు అందజేశారు. మరోవైపు తన భర్తను చంపిన వారిని శిక్షిస్తేనే తమకు న్యాయం జరుగుతుందని కానిస్టేబుల్ సుల్తాన్ సింగ్ భార్య పేర్కొన్నారు.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *