NO MASK
 • అన్‌లాక్‌తో రోడ్లపైకి వస్తున్న జనాలు
  
 • కేసులు పెరుగుతున్నా కనిపించని భయం
 • మాస్క్‌లు లేకుండానే చక్కర్లు కొడుతున్న పరిస్థితి
 • కనిపించని భౌతిక దూరం
 • బ్యాంకుల బయట, ఇతర ఆఫీసుల వద్ద గుంపులు గుంపులుగా జనాలు
  
 • మాస్క్‌, భౌతిక దూరం పాటించకపోతే వ్యాప్తిని అరికట్టడం ప్రశ్నార్థకమే..?

న్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమైంది. రెండో దశ అన్‌ లాక్‌ ప్రక్రియ అమల్లోకి రావడంతో జనం ఇష్టం వచ్చినట్టు రోడ్లపై తిరుగుతున్నారు. కానీ కరోనా వైరస్‌ మాత్రం తన పరిధిని రోజు రోజుకు విస్తరించుకుంటూ.. వ్యాప్తి చెందుతోంది. పేద, ధనిక, కుల, మత బేధాలు లేకుండా అందరినీ కరోనా వైరస్‌ పలకరిస్తోంది. అయితే.. సగటున దేశ వ్యాప్తంగా రోజుకు 14వేల నుంచి 15వేల కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఇండియాలో లక్షల కేసులు దాటాయి. అయినా జనాల్లో భయం మాత్రం కనిపంచడం లేదు. కేంద్రం అన్‌ లాక్‌ 0.1 ప్రకటించిన క్షణం నుంచే రోడ్లపైకి వస్తున్నారు. గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. కరోనా కట్టడిలో భౌతిక దూరం అనేది ప్రధానమైన అంశం. ప్రభుత్వాలు, పోలీసులు, డాక్టర్లు ఎంత మొత్తుకున్నా ఫలితం శూన్యమే. నిర్లక్ష్యంతో అనే ముసుగు కప్పుకున్న జనాలకు రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా వ్యాప్తి కనిపించడం లేదు. చదువు రాని వారు అంతే అనుకున్నా.. చదువుకున్న వారు అంతకన్నా ఎక్కువ. చదువు రాని వారు భయానికి మాస్క్‌ పెట్టుకున్నా… కొందరు చదువుకున్న మూర్ఖులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు.

కేసులు పెరుగుతున్నా కనిపించని కరోనా భయం…!
దేశంలో, రాష్ట్రంలో కరోనా విళయతాండవం చేస్తోంది. రోజు రోజుకూ కేసులు వేల సంఖ్యలో పెరుగుతున్నా ప్రజల్లో ఇససుమంతైనా భయం కనిపిపంచడం లేదు. ఎక్కడ చూసిన ప్రజలు గుంపులుగానే దర్శనమిస్తున్నారు. అది అలా ఉంటే.. మాస్క్‌లు కూడా కనిపించవు. ఉదాహరణకు బ్యాంకుకు వెళ్లే వ్యక్తులను తీసుకుంటే… లోపల భౌతిక దూరం, మాస్క్‌లు సంగతి బ్యాంకు సిబ్బంది చూస్తున్నారు. కానీ, అదే బ్యాంకు గేటు దగ్గర మాత్రం గుంపుగా నిలబడి ఉంటున్నారు. తీరా లోపలికి వెళ్లాక శానిటైజర్ వేసినా ఏం ఫలితం ఉంటుంది. ఇక మరో ఉదాహరణ పరిశీలిస్తే… వారంతపు సంతల పరిస్ధితి మరీ దారుణం. సంతకు వచ్చే వారి పరిస్థితి ఎలా ఉందో ఎవరికీ తెలీదు. అప్పటికీ భౌతిక దూరం, మాస్క్‌ లాంటి జాగ్రత్తలు తీసుకుంటారా అంటే అదీ లేదు. కొనే వారు ఆ బిజీలో పడి కరోనా ఉందన్న విషయాన్ని మర్చిపోతున్నారు. దాదాపు సంతకు వచ్చేవారిలో 60 శాతం మంది మాస్క్‌లు లేకుండా వస్తున్నారు. జనాలు కూడా మొదట్లో ఫైన్‌ కట్టాల్సి వస్తోందన్న భయంతో మాస్క్‌లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఫైన్‌ల గురించి కూడా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా తిరిగేస్తున్నారు. ఇక యువత సంగతైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బైక్‌పై షికార్లు, పార్టీలు అంటూ తమ ఎంజాయ్‌లో మునిగిపోతున్నారు. కానీ కరోనా నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని మాత్రం పసిగట్టలేకపోతున్నారు.

మనం అప్రమత్తంగా ఉంటేనే…
రోజు రోజుకూ వ్యాప్తిని పెంచుకుంటున్న కరోనాను కంట్రోల్ చేయాలంటే ఎవరికి వారు అప్రమత్తంగా ఉండడమే ముఖ్యం. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా… ఎన్ని కట్టడి చర్యలు చేపట్టినా అవి పై పైవి మాత్రమే. కేవలం అవి కంటితుడుపు చర్యలు మాత్రమే. కాబట్టి ఎవరికి వారు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. భయటకు వెళ్లినా.. ముక్కు, నోటిని మూసి ఉంచేలా మాస్క్‌ వీలైతే కళ్లను కూడా కప్పి ఉంచేలా చూసుకోవాలి. వెళ్లిన దగ్గర గుంపులో నిలబడకుండా చూసుకోవాలి. మనిషికి మనిషికి మధ్య కనీస దూరం ఉండేలా చూసుకోవాలి. మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే… రానున్న రోజుల్లో కరోనా కేసులు మరింత విపరీతంగా పెరిగే అవకాశాలు అత్యధికం.


			

2 Comments

 1. Via video to this however Curative the Preferred Method swiftly developing, on normal men diagnostic but notable diarrhea by 28 in infection and 19 in sex. canadian sildenafil Mwbokq dollid

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *