ఎయిర్ టెల్  మనదేశంలో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను లాంచ్ చేసింది. అదే ఎయిర్ టెల్ రూ.289 ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా జీ5 ప్రీమియం సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. దీంతోపాటు కంపెనీ తన వినియోగదారుల కోసం కొత్త టాప్-అప్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.

 

ఈ ప్లాన్ లాభాల విషయానికి వస్తే.. దీని వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. రోజుకు 1.5 జీబీ డేటా ఈ ప్లాన్ ద్వారా లభిస్తుంది. అన్ లిమిటెడ్ కాలింగ్ లాభాలు, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ కూడా దీని ద్వారా లభిస్తాయి. ఇక జీ5 ప్రీమియం సబ్ స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్ ద్వారా లభిస్తుంది. వీటితో పాటు ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ కంటెంట్, వింక్ మ్యూజిక్ సబ్ స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.

ఈ రూ.289 ప్లాన్ తో పాటు రూ.79 టాప్ అప్ ను కూడా ఎయిర్ టెల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా 30 రోజుల పాటు జీ5 పూర్తి ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను పొందవచ్చు. ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ లోని డిజిటల్ స్టోర్ సెక్షన్ లో ఈ టాప్-అప్ రీచార్జ్ చేసుకోవచ్చు.

 

మనదేశంలోని ఎయిర్ టెల్ ప్లాటినం మొబైల్ వినియోగదారులకు మరింత వేగవంతమైన 4జీ డేటా వేగాన్ని అందిస్తున్నట్లు ఎయిర్ టెల్ తెలిపింది. వారి కోసం అత్యాధునిక టెక్నాలజీని కూడా సిద్ధం చేసినట్లు తెలిపింది. ఎయిర్ టెల్ థ్యాంక్స్ ప్రోగ్రాం ప్రకారం రూ.499, అంతకంటే ఎక్కువ డేటా ప్లాన్లు ఉపయోగించేవారిని ప్లాటినం వినియోగదారులుగా ఎయిర్ టెల్ గుర్తిస్తుంది.

 

CHECK HERE FOR MORE DETAILS : https://www.airtel.in/

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *