యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌ 20వ సినిమా అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ కోసం ప్ర‌భాస్ ఫ్యాన్స్ వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ శుక్రవారం రోజు ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్రబృందం. ఈ మూవీలో బాహుబలి సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుండగా… ప్ర‌భాస్, పూజా హెగ్దే రొమాంటిక్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ముందుగా ప్ర‌చారం జ‌రిగిన‌ట్లే ప్ర‌భాస్ 20వ చిత్రానికి రాధే శ్యామ్ అని టైటిల్ ఖ‌రారు చేయ‌గా… ఫ‌స్ట్ లుక్ తోనే సినిమా ఎలా ఉండ‌బోతుందో చెప్పేసింది నిర్మాణ సంస్థ‌.

ఇక ఈ సినిమా 1920ల నాటి క‌థ‌తో యూర‌ప్ నేప‌థ్యంగా తెరెక్కిస్తున్నారు. యూవీ క్రియేష‌న్స్‌, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ చిత్రం… రొమాంటిక్ డ్రామాగా, పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికీ కొంత‌మేర చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. అయితే లాక్ డౌన్ కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది. కాగా వ‌చ్చే ఏడాది వేస‌వి కానుకగా ఈ సినిమా విడుద‌లయ్యే అవ‌కాశం ఉంది.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *