కరోనా మహమ్మారి లేకుండా ఉండి ఉంటే ఈ పాటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ పూర్తయిపోయి రిలీజ్ అయిపోయి ఉండేది. కానీ లాక్ డౌన్ కారణంగా 80 శాతం వద్ద ఈ సినిమా షూటింగ్ దగ్గరే ఆగిపోవడం పవన్ ఫ్యాన్స్ నిరాశే. ఆగష్టు ఫస్ట్ వీక్ లో షూట్ తిరిగి మొదలుపెట్టాలని టీమ్ ప్లాన్ చేస్తోన్నా.. ఆ పరిస్థితి కనబడటం లేదు. అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా కోర్టు సెట్ వేస్తున్నా.. ఇప్పట్లో షూట్ చేయడం మంచింది కాదని టీం ఫిక్స్ అయిందట.

ఇక ఈ సినిమా ఓ ఫైట్ మీద ఓపెన్ అవుతుంది. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనబడనున్న తొలి సీన్ ఫైట్‌ కావడం పవన్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే అంశం. ఈ రీమేక్ మూవీ ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా భిన్నంగా ఉంటుందట. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు స్క్రిప్ట్ లో చాలానే మార్పులు చేశారని.. ముఖ్యంగా పవన్ కోసం యాక్షన్ సాంగ్స్ యాడ్ చేశారని సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *