రోజు రోజుకి కొత్త కొత్త బాబా పుట్టుకోస్తూనే ఉంటున్నారు.అలాగే సిద్దిపేటలో ఒక కొత్త బాబా పుట్టుకొచ్చారు. ఆ పుట్టుకొచ్చిన బాబా అతని అనుచరుడు భక్తి పేరుతో ఓ మహిళను లొంగదీసుకోవాలని చూశాడు బాబా అనుచరుడు. దీంతో బాబా అనుచరుడు నరేష్‌పై ఫిర్యాదు చేసింది ఆ మహిళ. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు వివరాలలోకి వెళ్ళితే ధర్మాజీ పేట గ్రామానికి చెందిన రఘు ఇంటర్ పూర్తి చేసుకొని కొన్ని రోజులు ఇంటి వద్దనే ఉన్నాడు.

ఒక్కసారిగా బాబా అవతారమెత్తి పెద్ద చికోడ్ గ్రామ శివారులో సాయి సమర్థ ఆశ్రమం నడుపుతున్నాడు. కొన్నేళ్లుగా అతను రఘుబాబా అలియాస్ సమర్థ సాయిగా చలామణి అవుతున్నాడు. తన అనుచరుడు నరేష్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు మాటలు చెప్పి అత్యాచారానికి యత్నించాడు. దీంతో ఆ యువతి దుబ్బాక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు బాబా అనుచరుడు నరేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *