భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ వెల్లడించారు. వైద్యుల నిరంతర కృషి ఫలితంగా ప్రణబ్‌ కోలుకుంటున్నారని వెల్లడించారు. ప్రస్తుతం అన్ని అవయవాలు నియంత్రణలోనే ఉన్నాయని, వైద్యానికి పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపారు. ప్రణబ్‌ ఆరోగ్యం మెరుగుదలకు సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని అభిజిత్‌ ముఖర్జీ ట్విటర్‌లో తెలిపారు. ఈ సందర్భంలో ప్రణబ్‌ తొందరగా కోలుకోవాలని ప్రతిఒక్కరూ ప్రార్థిచాలని కోరారు.

మెదడులో రక్తం గడ్డకట్టడంతో ప్రణబ్‌ముఖర్జీకి దిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆసుపత్రిలో ఈ నెల 10వ తేదీన శస్త్రచికిత్స చేశారు. అనంతరం వైద్య పరీక్షల్లో ప్రణబ్‌కు కొవిడ్‌ వైరస్‌ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రణబ్‌ ఆరోగ్య పరిస్థితిని నిపుణుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోంది. ఆయన ఆరోగ్యంపై ఆర్మీ ఆసుపత్రి వర్గాలు ఎప్పటికప్పుడు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేస్తున్నాయి.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *