తెలంగాణలో చెల్లని నోటు.. ట్రోలింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికలు వచ్చాయంటే చాలు ఈ డైలాగ్ యుద్ధంలా దూసుకొస్తుంది. అయితే ఈ డైలాగ్ ఇప్పుడు మరోసారి తెరపైకి రావడం, అదికూడా సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితపై రావడంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు.‌.. ట్రోలింగ్ బాబాయ్‌లు రెచ్చిపోతున్నారు.

అయితే, తాజాగా.. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోటీ చేయగా.. టీఆర్ఎస్ దూకుడుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కనీస పోటీని ఇవ్వలేకపోయాయి. ఇక కవిత గత పార్లమెంట్ ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. అయితే, ఇదే అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ రొచ్చుగా మారుతోంది. గతంలో టీఆర్ఎస్ నుంచి వచ్చిన చెల్లని నోటు కాన్సెప్ట్‏‌తో ఇప్పుడు విపరీతంగా ట్రోల్ అవుతోంది.

గతంలో జరిగిన ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికల సందర్భంగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఒక దగ్గర చెల్లని నోటు మరెక్కడ చెల్లదంటూ మాట్లాడిన మాటలకు.. మాజీ ఎంపీ కవిత ఫోటోను సెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఫోటో సెట్ చేసిన విధానం హస్యస్పదంగా మారింది. ఒకచోట ఓడిపోయిన అభ్యర్థులను మరోక చోట నిలబెట్టి ప్రజలకు రుద్దుతారా..? అంటూ.. నోటుతో పోల్చుతూ మంత్రి కేటీఆర్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు ట్రోల్ అవుతోంది. ఒక షాప్‏లో‏ చెల్లని నోటు మరో షాప్‏లో‏ చెల్లుతుందా..? చిరిగిన నోటు ఎక్కడైనా చెల్లుతుందా..? అంటూ కేటీఆర్ మాట్లాడిన వీడియోకు కల్వకుంట్ల కవిత ఫోటోను సెట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

రజిత. సబ్ ఎడిటర్.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *