తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల నమోదు కార్యక్రమం వేగంగా సాగుతోంది. కొత్త చట్టంతో వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి, భూ రికార్డులను ప్రజలకు సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రత్యేక వెబ్‏సైట్‌ను “ధరణి” పేరుతో రూపొందించింది. ఈ వెబ్ సైట్ సీఎం కేసీఆర్ చేతులమీదుగా ఈనెల 25న ప్రారంభం కానుంది.

కాగా, ధరణి వెబ్‏సైట్‏ డేటా ఆధారంగానే రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అటు.. భూ రిజిస్ట్రేషన్లకు, మరే ఇతర రికార్డులను పరిశీలించరాదని వెల్లడించింది. అటు… ధరణి ప్రారంభమైన రోజునుంచి హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా 570 మండలాల్లోని వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. తొలిదశలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి నాలుగు డాక్యుమెంట్లను మాత్రమే చేయడానికి తహసీల్దార్లకు అవకాశం ఇచ్చారు. ఇందుకోసం భూముల విక్రయాలకు సంబంధించిన సేల్ డీడ్, కుటుంబ సభ్యులు/ ఇతర భూముల యాజమానులు పంచుకునే పార్టిషన్, కుటుంబసభ్యులు సమర్పించే సక్సెషన్ (వారసత్వ) డీడ్, గిఫ్ట్ డీడ్‏లు చేయడానికే తహసీల్దార్లకు అవకాశం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

శనివారం ధరణి (వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్) పై తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, రెవెన్యూ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అనుమానాలు వ్యక్తం చేయగా, కొన్నింటికి యంత్రాంగం జవాబు ఇచ్చింది. ధరణి పోర్టల్ సన్నద్ధతపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సోమేశ్ కుమార్ ధరణి పోర్టల్ దేశంలోనే విప్లవాత్మకంగా నిలుస్తుందని అన్నారు. ధరణి సేవలకు అంతరాయం కలుగకుండా చూసేందుకు డిస్కమ్, బ్రాడ్‏బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లు, TSTS ప్రతినిధులతో క్రమం తప్పకుండా సమన్వయ సమావేశాలు నిర్వహించాలి సూచించారు.

రజిత చంటి, సబ్ ఎడిటర్.

18 Comments

  1. I really like what you guys are usually up too. This sort of clever work and coverage! Keep up the awesome works guys I’ve you guys to my own blogroll.|

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *