తులు సాగు సమస్యలపై చర్చిండం, అధిక దిగుబడులు, సస్యరక్షణ కోసం అవలంబించాల్సిన అధునాతన పద్ధతులపై అవగాహన పెంచుకొనేందుకు నిర్మించిన రైతు వేదికలు సిద్ధమయ్యాయి. జనగామ జిల్లా కొడకండ్లలో నిర్మించిన రైతు వేదికను శనివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించారు.

రాష్ట్ర వ్యాప్తంగా రూ. 350 కోట్ల వ్యయంతో 2,601 రైతు వేదికలు నిర్మిస్తోంది ప్రభుత్వం. ఇందులో 2,462 గ్రామీణ ప్రాంతాల్లో, 139 పట్టణాల్లో ఉన్నాయి. ఒక్కో రైతు వేదికను 2,046 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 22 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 1,951 రైతు వేదికల నిర్మాణం పూర్తికాగా, 650 నిర్మాణ దశలో ఉన్నాయి. పక్షం రోజుల్లో వీటన్నింటినీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ఆదేశించారు. ఇందులో భూవిరాళంతో నిర్మిస్తున్న రైతు వేదికలు 139 ఉన్నాయి. రైతు వేదికలో రెండు గదులు, మరుగుదొడ్లు, విశాలమైన హాలు నిర్మిచడంతోపాటు మిషన్‌ భగీరథ ద్వారా నల్లా కనెక్షన్‌ ఇచ్చారు. ప్రతి వేదికకూ విద్యుత్తు సదుపాయం కల్పించారు.

రైతు వేదిక ఒక ఆటం బాంబు…
రైతు వేదిక నా గొప్ప క‌ల.. రైతాంగం ఒక‌చోట కూర్చొని మాట్లాడుకోవాలి. నియంత్రిత సాగుపై మాట్లాడిన‌ట్లే చ‌ర్చ చేయాలి. రైతు వేదిక ఒక ఆటం బాంబు, ఒక శ‌క్తి అని పేర్కొన్నారు. రైతులంద‌రూ సంఘ‌టితంగా మారాలి. రైతు వేదిక‌లు నిజ‌మైన రైతు వేదిక‌లు కావాలి. రైతులంద‌రూ వేదిక‌ల్లో కూర్చొని ఏ పంట వేయాల‌ని నిర్ణ‌యించాలి. మ‌ద్ద‌తు ధ‌ర‌ను కూడా నిర్ణ‌యించాలి అని సీఎం కేసీఆర్ అన్నారు.

జ‌న‌గామ జిల్లా కొడ‌కండ్ల‌లో రైతు వేదిక‌ను ప్రారంభించిన అనంత‌రం అక్క‌డి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. రైతు వేదిక‌ను ప్రారంభించ‌డంతో ఈ రోజు నాకు సంతోషంగా ఉంది. మేడ్చ‌ల్‌లో కొత్త చ‌రిత్ర‌కు శ్రీకారం చుట్టాం. కొడ‌కండ్లలో మ‌రో చ‌రిత్ర‌కు శ్రీకారం చుట్టాం. భార‌త‌దేశంలో ఎక్క‌డా లేని విధంగా రైతు వేదిక‌ల‌ను తెలంగాణ‌లో ఏర్పాటు చేశాం. ప్ర‌పంచంలో కూడా రైతు వేదిక‌లు లేవు. అమెరికా, యూర‌ప్ దేశాల్లో కూడా రైతులు నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తూనే ఉంటారు. ట‌న్నుల కొద్ది ట‌మాటాలు, ఆలుగ‌డ్డ‌లు ప‌డేస్తనే ఉంటారు. రైతు పెద్ద‌వాడు అనేది విన‌డానికి బాగానే ఉంది. రైతులు కూర్చోవ‌డానికి వేదిక‌లు లేవు. ఆగ‌మాగం ఉంది. ఇత‌ర దేశాల్లో రైతుల‌కు ప్ర‌భుత్వాలు రాయితీలు ఇస్తున్నాయి. రైతుల‌కు స‌బ్సిడీలు ఇస్తామంటే కేంద్రం ఇవ్వొద్ద‌ని ఆంక్షలు పెడుతుంది.

వ‌రి ధాన్యాన్ని రూ.1888కే కొనాలి. అంత‌కంటే ఎక్కువ పెట్టి కొంటే ధాన్య‌మే తీసుకోం అని ఎఫ్‌సీఐ ఆర్డ‌ర్ చేసింది. స‌న్న వ‌డ్ల‌కు ఎక్కువ ధ‌ర చెబుదామంటే చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇది దేశంలోని రైతుల మీద ఉన్న ప్రేమ‌. ఇది ఆషామాషీ విష‌యం కాదు. ఈ విష‌యాన్ని రైతులంద‌రూ గ‌మ‌నించాలి. వీట‌న్నింటిని అధిగ‌మించేందుకు ఆలోచించాలి. కేంద్ర ప్ర‌భుత్వం క‌ళ్లు తెరిపించాలి. తాము లేనిది మీరు ఎక్క‌డ ఉన్న‌ది అని వార్నింగ్ పంపించాలి అని సీఎం కేసీఆర్ అన్నారు.

‘ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ర్టం తెలంగాణ మాత్ర‌మే
ఇండియాలో ఏ రాష్ర్ట ప్ర‌భుత్వం కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయ‌డం లేదు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక ప్ర‌భుత్వం తెలంగాణ మాత్ర‌మే అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. జ‌న‌గామ జిల్లాలోని కొడ‌కండ్ల‌లో రైతు వేదిక‌ను ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేసీఆర్ ప్ర‌సంగించారు. ధాన్యానికి మంచి ధ‌ర ఇద్దామంటే మెడ మీద క‌త్తి పెడుతున్నారు. ఈ ర‌క‌మైన చిక్కుల్లో మ‌నం ఉన్నాం. రైతుల బాధ‌లు, ఆత్మ‌హ‌త్య‌లను క‌ళ్లారా చూశాను. వాటిని చూసి బాధ‌ప‌డ్డాను. సీఎం అయిన త‌ర్వాత క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకున్నా. తెలంగాణ రైతాంగం భార‌త‌దేశంలోనే అగ్ర‌గామిగా ఉండాల‌ని ప్ర‌తిజ్ఞ తీసుకున్నాం. ఇది టెక్నాల‌జీ యుగం. అంద‌రి వ‌ద్ద స్మార్ట్ ఫోన్లు, ఇంట‌ర్నెట్ ఉంది. దీంతో ప్ర‌జ‌లంద‌రూ వాస్త‌వాలు తెలుసుకోవాలి. రైతులు చ‌ర్చ చేయాలి.

గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు..
క‌రోనా మ‌హ‌మ్మారి పీడ ఇంకా ఉంది. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. సెకండ్ వేవ్ క‌రోనా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో రైతుల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామ‌న్నారు. తెలంగాణ రైతు లోకానికి దండం పెట్టి చెబుతున్నాను. ఈ వేదిక‌లో ప్ర‌పంచంలో, దేశంలో ఎక్క‌డా లేవు. క‌డ‌కొండ్ల‌లో రైతు వేదిక ప్రారంభించ‌డం సంతోషంగా ఉంది. రాజ్యం గెలిచినంతా సంతోష‌మైంది. కేబినెట్ స‌మావేశాల్లో చ‌ర్చ‌లు జ‌రిపి.. రైతు వేదిక‌లు నిర్మించాల‌ని సంక‌ల్పించాం. ఎన్ని వంద‌ల కోట్లు అయినా స‌రే ఖ‌ర్చు పెట్టి రైతు వేదిక‌ల‌ను నిర్మాణం చేశాం. రాష్ర్ట వ్యాప్తంగా 2601 రైతు వేదిక‌లు నిర్మిస్తున్నాం. మ‌రో వారం రోజుల్లో అన్ని వేదిక‌లు పూర్త‌వుతాయి. దాదాపుగా 600 కోట్లు ఖ‌ర్చు పెట్టామ‌న్నారు. గొప్ప ఉద్దేశంతో, అవ‌గాహ‌న‌తో ఈ వేదిక‌ల‌ను నిర్మించామ‌న్నారు.

వ్య‌వ‌సాయ శాఖ‌లో ప్ర‌బ‌ల‌మైన మార్పులు…
రాష్ర్ట స్థాయిలో వ్య‌వ‌సాయ శాఖ‌లో ప్ర‌బ‌ల‌మైన మార్సులు తీసుకువ‌స్తున్నాం. ఒక ఐఏఎస్ ఆఫీస‌ర్‌ను నియ‌మించి పంట‌ల విధానంపై చ‌ర్చ చేస్తారు. మార్కెటింగ్ ప‌రంగా సూచ‌న‌లు చేస్తారు. ప్ర‌తి రైతుకు స‌మాచారం అందేలా అధికారులు ప‌ని చేస్తారు. అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీ అధికారులు రైతుల‌కు పాఠాలు చెప్పి.. మెల‌కువ‌లు, సూచ‌న‌లు చెబుతారు. ఆన్‌లైన్ ద్వారా ఈ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తాం. దీంతో రైతులు త‌ప్ప‌కుండా బంగారం పండిస్తారు. రైతు వేదిక‌ల్లో టీవీలు ఏర్పాటు చేస్తారు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

రైతు రాజ్య‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం 

తెలంగాణలో రైతు రాజ్య‌మే సృష్టించ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. జ‌న‌గామ జిల్లాలోని కొడ‌కండ్ల‌లో రైతు వేదిక‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించి ప్ర‌సంగించారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌, రైతు వేదిక‌లు, రైతుబంధు, రైతుబీమా ఉట్టిగా పెట్టలేదు. రైతులంద‌రూ సంఘ‌టితం కావాల‌నే ఉద్దేశంతోనే వీట‌న్నింటిని చేప‌ట్టాం. రైతులు ఎవ‌రికీ వారే ఉంటే ఆగ‌మాగం అవుతాం. సంఘ‌టితంగా ఉన్న‌ప్పుడే ఫ‌లితాలు సాధ్య‌మ‌వుతాయి. లాభసాటి వ్య‌వ‌సాయం చేయాలి. కూర‌గాయాలు, ధాన్యం ధ‌ర‌లు ద‌ళారీల చేతుల్లోకి పోవ‌ద్దు. ఇవ‌న్నీ తొల‌గిపోవాలంటే రైతు వేదిక‌లే కీల‌క పాత్ర పోషిస్తాయి. రైతు వేదిక‌లు దేశానికి ఆద‌ర్శంగా నిల‌వ‌బోతున్నాయి. సంక‌ల్పం, చిత్త‌శుద్ధి, ధైర్యం ఉంటే ఏదైనా సాధించొచ్చు. తెలంగాణ‌లో రైతు రాజ్యం వ‌చ్చి తీరుత‌ది. రాష్ర్ట రైతుబంధు క‌మిటీ ధ‌ర నిర్ణ‌యించిన త‌ర్వాత మార్కెట్లోకి వెళ్లాలి. అప్పుడే గొప్ప‌గా రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు వ‌స్తాయి. తెలంగాణ రైతాంగ‌మంతా కొన్ని విష‌యాల‌ను సీరియ‌స్‌గా తీసుకోవాలి. నేను సీఎం అయ్యేనాటికి వ్య‌వ‌సాయ శాఖ‌ను చంపేశారు. కానీ ఇప్పుడు వ్య‌వ‌సాయ శాఖ‌లో అన్ని పోస్టులు భ‌ర్తీ చేశాం. వ్య‌వ‌సాయ శాఖ అద్భుతంగా ప‌ని చేస్తుంది.

ఇవి బ‌తుకుదెరువు వేదిక‌లు…
ఈ వేదిక‌లు యాక్టివ్‌గా ఉండేలా రైతు బంధు క‌మిటీలు నాయ‌క‌త్వం వ‌హించాలి. ఇది గొప్ప నిర్ణ‌యం. 50 నుంచి 60 శాతం మంది ప్ర‌జ‌ల‌కు ఈ వేదిక‌లు బ‌తుకుదెరువు. ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్ పెడితే సు‌స్ప‌ష్టంగా చెప్పాను. ఏది ఏమైనా స‌రే.. మ‌న దేశం యొక్క ప‌రిస్థితి ఏవి నిలుపుద‌ల చేసినా, వ్య‌వ‌సాయం ఆప‌కూడ‌ద‌ని చెప్పాను. ప్ర‌పంచంలో 200 పైచిలుకు దేశాలున్నాయి. తెలంగాణ రాష్ర్టం కంటే చిన్న‌గా 180 దేశాలు ఉన్నాయి. ఎట్టి ప‌రిస్థితుల్లో ఆహార రంగంలో స్వ‌యం శ‌క్తి ఉండాల‌ని సూచించాను. చాలా సీఎంలు నిజ‌మ‌ని చెప్పారు. అన్నం పెట్టే శ‌క్తి ప్ర‌పంచంలో ఎవ‌రికీ లేదు. ఎప్పుడు ప‌రిస్థితులు ఒకేలా ఉండ‌వు. అన్నం పెట్టే శ‌క్తి కేవ‌లం తెలంగాణ‌కు మాత్ర‌మే ఉంద‌న్నారు.

ఉమ్మ‌డి ఏపీలో ఆగ‌మాగం….
ఉమ్మ‌డి ఏపీలో రైతుల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఎరువులు, విత్త‌నాలు స‌కాలంలో పంపిణీ చేయ‌లేదు. కానీ కాలం మారింది. తెలంగాణ రాష్ర్టంలో రైతులు నిమ్మ‌లం అయ్యారు. ఇంకా కావాలి. రైతులు బాగుండాలి. కిరికిరి గాళ్లు ఎప్ప‌టికీ ఉంట‌రు. గ్రామాలు మంచిగా ఉండాలి. గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌రిపుష్టం కావాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్యం. కుల‌వృత్తుల‌ను బ‌లోపేతం చేయాలి. ఇండియా మొత్తంలో ఎక్క‌డా లేని విధంగా గొర్రెల పెంప‌కం దారుల‌కు 75 శాతం స‌బ్సిడీ ఇచ్చాం అని సీఎం కేసీఆర్ తెలిపారు.

ద‌ళితుల కోసం ద‌ళిత చైత‌న్య జ్యోతి
రాష్ర్టంలోని అన్ని వ‌ర్గాల‌ను బాగు చేసుకుంటున్నాం.. ద‌ళిత వ‌ర్గాల‌ను కూడా బాగు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. కొడకండ్ల రైతు వేదిక ప్రారంభం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో సీఎం మాట్లాడుతూ.. వ్య‌వ‌సాయ రంగాన్ని బాగు చేసుకుంటున్నాం. గొర్రె కాప‌రుల‌ను, గీతకార్మికుల‌ను, మ‌త్స్య‌కారుల‌ను కూడా బాగు చేసుకుంటున్నాం. చేనేత కార్మికుల‌ను ఆదుకుంటున్నామ‌ని తెలిపారు. ఈ ర‌కంగా ప్ర‌తి ఒక్క‌ర్ని కాపాడుకుంటున్నాం. ద‌ళితుల‌ది కూడా ఛాలెంజ్ ఉంది. ద‌ళితులు బాధ‌లు అనుభివిస్తున్నారు. సామాజిక వివ‌క్ష‌కు గుర‌వుతున్నారు. ఎస్సీ, ఎస్టీ కులాల‌ను బాగు చేసుకోవాలి. మ‌న ద‌ళిత‌, గిరిజ‌న వ‌ర్గాలు పైకి రావాలి. ప్ర‌య‌త్నం మొద‌లు పెట్టాం. గురుకుల పాఠ‌శాల‌లు పెట్టి ఆ పిల్ల‌ల‌ను చ‌దివిస్తున్నాం. ఇంకా చ‌దివించాలి. ఆ వ‌ర్గాల కోసం ద‌ళిత చైత‌న్య జ్యోతి అనే ఓ కార్య‌క్ర‌మం తేవాల‌ని ఆలోచ‌న ఉంది. త్వ‌ర‌లోనే ఆ విష‌యాలు వెల్ల‌డిస్తాం. కులం, మ‌తం జాతి లేదు. నాలుగు కోట్ల మంది మ‌నోళ్లే. కంటి నిండా నిద్ర పోయే తెలంగాణ రావాలి. తెలంగాణ రైతాంగం దేశానికి దిక్సూచి కావాలి అని సీఎం కేసీఆర్ అన్నారు.

రైతు వేదిక ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, రైతు స‌మ‌న్వ‌య స‌మితి అధ్య‌క్షుడు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

కొడ‌కండ్ల‌కు చేరుకున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ప్ర‌జాప్ర‌తినిధులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికి ఆశీర్వ‌దించారు. అర్చ‌కుల మంత్రోచ్ఛ‌ర‌ణాల మ‌ధ్య రైతు వేదిక శిలాఫ‌ల‌కాన్ని సీఎం ఆవిష్క‌రించారు. రైతులు పెద్ద ఎత్తున చ‌ప్ప‌ట్లు కొట్టి సీఎం కేసీఆర్‌కు మ‌ద్ద‌తు తెలిపారు. రైతు వేదిక అందుబాటులోకి రావ‌డంతో రైతులంద‌రూ సంతోషం వ్య‌క్తం చేశారు.

18 Comments

 1. Nice post. I learn something totally new and challenging on sites I stumbleupon everyday.

  It’s always helpful to read articles from other writers
  and practice a little something from their websites.

 2. With havin so much content and articles do you ever run into any
  problems of plagorism or copyright infringement?

  My blog has a lot of exclusive content I’ve either written myself or outsourced but
  it appears a lot of it is popping it up all over the internet without my permission.
  Do you know any methods to help stop content from being
  ripped off? I’d really appreciate it.

 3. This design is incredible! You obviously know how to keep a reader amused. Between your wit and your videos, I was almost moved to start my own blog (well, almost…HaHa!) Fantastic job. I really enjoyed what you had to say, and more than that, how you presented it. Too cool!|

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *