హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ ఎన్నికకు నగారా మోగింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్, షెడ్యూల్‌ను మంగళవారం ఎస్ఈసీ పార్థసారథి ప్రకటించారు. డిసెంబర్ 1న బల్దియా పోలింగ్, 4న కౌంటింగ్‌ను నిర్వహిస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది. బుధవారం (నవంబర్ 18) నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21న పరిశీలన, 22న ఉపసంహరణ, డిసెంబర్ 1న పోలింగ్ నిర్వహిస్తారు. అవసరమైన చోట డిసెంబర్ 3న రీపోలింగ్ నిర్వహిస్తారు. 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుందని వెల్లడించారు. గత ఎన్నికల రిజర్వేషన్ల ప్రకారమే ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక, ఫిబ్రవరి 10న జీహెచ్ఎంసీ ప్రస్తుత పదవీకాలం ముగుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *