భారత్‌లో కరోనా సెకండ్ వేవ్.. ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ…!

కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. రెండో వేవ్‌లో భారత్‌కు భారీ ముంపు పొంచి ఉందన్న ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు.. ఆందోళన కలిగిస్తోంది. కరోనానే కదా అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంది. అది కూడా ఒక జ్వరం లాంటిదే అంటూ కొట్టిపడేస్తున్న వారికి షాకిస్తూ… రెండవ వేవ్‌లో ప్రాణాలకే ముంపు పొంచి ఉంటుందన్నది నమ్మలేని నిజం. ఇప్పటికే ప్రారంభమైన సెకండ్ వేవ్‌ కారణంగా పలు రాష్ట్రాల్లో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా కేసుల విస్తరణ 18 శాతం పెరిగింది. మొత్తం కేసుల సంఖ్య 90 లక్షలకు చేరుకుంటోంది.

ఇక… గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో మళ్లీ కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఓ వైపు పెరుగుతున్న చలి కూడా కరోనా పెరగడానికి కారణమవుతోందని నిపుణులు చెపుతున్నారు. ఇప్పటి వరకు అహ్మదాబాద్‌లో 46,022 కేసులు నమోదయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో… రాత్రి పూట కర్ఫ్యూ విధించింది అహ్మదాబాద్‌ ప్రభుత్వం. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. పండుగల వల్ల కరోనా కేసులు పెరిగాయని చెప్పారు. నగరంలోని ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు కావాల్సినన్న బెడ్లు ఉన్నాయని తెలిపారు. 40 శాతం బెడ్లు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని అడిషనల్ చీఫ్ సెక్రటరీ రాజీవ్ కుమార్ గుప్తా చెప్పారు. అహ్మదాబాద్ కోవిడ్-19 స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ గా ఈయన బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

3 Comments

  1. Hi there! Do you use Twitter? I’d like to follow you if that would be ok. I’m absolutely enjoying your blog and look forward to new updates.|

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *