టీఆర్ఎస్ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 20 సీట్లు కూడా రావని స్పష్టమైందన్నారు. జియాగూడలో బీజేపీ అభ్యర్థి దర్శన్‌కు మద్దతుగా ప్రచారం చేసిన ఆయన… హైదరాబాద్ అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని కోరారు.
అటు, టీఆర్ఎస్ గత ఎన్నికలప్పుడు విడుదల చేసిన మేనిఫెస్టో ఫెయిల్ అయ్యిందని… అదే మేనిఫెస్టోను కొత్తగా రూపొందించారని విమర్శించారు. టీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై ప్రజల నుంచి రెస్పాన్స్ రావడం లేదన్న ఆయన… బీజేపీ కార్యకర్తలను పోలీసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. మతాల మధ్య విభేదాలను బీజేపీ సృష్టించడం లేదని.. కేటీఆరే విద్వేషాలను సృష్టిస్తున్నారని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మంచి పరిపాలన జరుగుతోందని స్పష్టం చేశారు. అది మీకు కనిపించడం లేదా కేటీఆర్… ? అంటూ విమర్శించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండి పార్లమెంట్ స్థానాల్లోనూ, దుబ్బాక ఉప ఎన్నికలోను ఓడిపోయిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఓడిపోబోతున్నారంటూ వివేక్ ధీమా వ్యక్తం చేశారు.