తూర్పుగోదావరి జిల్లా గోళీలపేటలో దారుణం జరిగింది. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ దుర్మార్గుడు… 5 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉదయం చిన్నారిని అక్కడే వదిలేసి పారిపోయాడు. చిన్నారి ఏడుస్తూ ఉండడం గమనించిన స్థానికులు కాకినాడా ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు… నిందితుడి కోసం గాలిస్తున్నారు.
రోజు రోజుకు భూమిమీద మహిళ రక్షణ ప్రశ్నార్ధకంగా మారుతోంది. నిత్యం ఎక్కడో ఒక చోట అత్యాచారాలు, హత్యలు చూడాల్సి వస్తోంది. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మృగాళ్లలో మార్పు రావడంలేదు. నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలు అమలు చేస్తున్నప్పటికీ దాడులను ఆపలేకపోతున్నాయి ప్రభుత్వాలు. వయసు, వావీ వరసలు మరిచి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు బయట తిరగాలంటే భయపడాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. గోళీలపేట ఘటనలో నిందితుడిని పట్టుకుని, కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.