బీజేపీలోకి స్వామిగౌడ్, ముహుర్తం ఫిక్స్‌…

టీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ బీజేపీలో చేరబోతున్నారు. గురువారం సాయంత్రం ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్జీవో అధ్యక్షుడిగా స్వామిగౌడ్ కీలకపాత్ర పోషించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికైన స్వామిగౌడ్… శాసనమండలి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే, గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్‌కు ఆయన దూరంగా ఉంటున్నారు.

ఇటీవల బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లతో భేటీ అయిన తర్వాత స్వామిగౌడ్ బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం జరిగింది. అయినప్పటికీ స్వామిగౌడ్ మౌనంగానే ఉన్నారు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు స్పష్టమైన సమాచారం అందింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు నమ్మకస్తుడిగా ఉన్న స్వామిగౌడ్ బీజేపీలో చేరనుండటం చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *