కరోనా దెబ్బ.. టెన్త్ విద్యార్థులకు శుభవార్త

కరోనా వైరస్‌ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యాసంవత్సరం మొదటి నుంచి ఎలాంటి తరగతులు జరగకపోవడంతో పరీక్షా పేపర్లను కుదించాలని నిర్ణయించింది. కరోనా కారణంగా… ప్రతియేటా 11 పేపర్లతో జరిగే పదోతరగతి పరీక్షలను ఆరుకు కుదించాలని కోరుతూ… ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇప్పటి వరకు ఒక్కో సబ్జెక్టుకు రెండు ప్రశ్న పత్రాలు ఉండగా, హిందీకి మాత్రం ఒకటే ఉంటోంది. కానీ, వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో వార్షిక పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్న విద్యాశాఖ… ఒక్కో సబ్జెక్టుకు ఒక్క ప్రశ్న పత్రం మాత్రమే ఉండేలా చర్యలు చేపట్టింది. ప్రశ్నల్లో కూడా చాయిస్‌లతోపాటు బహుళ ఐచ్ఛిక ప్రశ్నల సంఖ్యను కూడా పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఆదేశించినట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 5.50 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలు తెరిచిన తర్వాత పనిదినాలను బట్టి ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రస్తుతం కరోనా కేసులు నెమ్మదిస్తూ పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్న నేపథ్యంలో సంక్రాంతి పండుగ తర్వాత 9,10 తరగతుల విద్యార్థుల కోసం స్కూళ్లు తెరిచి ప్రత్యేక బోధన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్పటికి పరీక్షల సమయం ఇంకా నాలుగు నెలలు ఉంటుంది కాబట్టి సన్నద్ధమయ్యేందుకు విద్యార్థులకు కావాల్సినంత సమయం లభిస్తుందని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *