ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉచిత కోచింగ్‌కు బీసీ స్టడీ సర్కిల్‌ నోటిఫికేషన్

తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తోంది. ఎస్‌ఐ, పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ పరీక్షల కొరకు ఉచిత ఆన్‌లైన్‌ కోర్సు శిక్షణకు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ ఎన్‌.బాలాచారి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేయటానికి… tsbcstudycircle.cgg.gov.in నందు దరఖాస్తు ఫారం, పూర్తి నోటిఫికేషన్‌ వివరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నెల 24 నుండి 31వ తేదీ లోపు ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఇక, దరఖాస్తు చేసుకునే గ్రామీణ ప్రాంత అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతానికి చెందిన అభ్యర్థులు రూ. 2 లక్షలు మించకూడదు. మరిన్ని వివరాలకు 040-24071178, 6302427521 నెంబర్లకు ఆఫీస్‌ పనివేళలలో ఫోన్‌కాల్‌ చేసి సంప్రదించవచ్చని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *