సర్జికల్ స్ట్రైక్ చేస్తామనడం తప్పా…? -బండి సంజయ్

నాగార్జునసాగర్‌లోనూ బీజేపీ జెండా ఎగుతురుతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎక్కడుంది అన్నవాళ్లకు… దుబ్బాక, జీహెచ్‌ఎంసీలో గెలిచి చూపించామన్నారు. వరంగల్, సిద్దిపేట, ఖమ్మం, అమాన్ గల్‌లో తామే గెలుస్తామన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన… కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులు నచ్చిన చోట, నచ్చిన ధరకు పంటను అమ్ముకోవాలని చెప్పడం తప్పా..? అని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్‌ మొన్న ఢిల్లీ ఎందుకు పోయాడో అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి వెళ్లి వంగి వంగి దండాలు పెట్టాడని.. పొర్లుదండాలు పెట్టినా విడిచి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అన్ని వర్గాలు బాగుపడాలనే ఉద్దేశ్యం నరేంద్రమోడీదని పేర్కొన్నారు. రైతులను సన్నవడ్లు పండించమని… తాను ఫార్మ్‌ హౌస్‌లో మాత్రం దొడ్డు వడ్లు పండించాడని ఫైర్‌ అయ్యారు. కుటుంబ, అరాచక పాలనను అంత మొందిస్తామన్న బండి సంజయ్… రాష్ట్ర ప్రజలు మార్పును కోరుతున్నారని, అది బీజేపీ వల్లే సాధ్యమని ప్రజలకు తెలుసన్నారు. సారు కారు ఇక రారని… రాష్ట్రంలో మంత్రులందరూ రబ్బరు స్టాంప్‌లు అయ్యారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదని… కొందరు కావాలని బీజేపీని మతతత్వ పార్టీగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశానన్నారు… సర్జికల్ స్ట్రైక్ చేస్తామనడం తప్పా…? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి చొరబడిన వారిపై, తుపాకులతో అరాచకాలు చేసేవారిపై సర్జికల్ స్ట్రైక్ చేయొద్దా అని బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *