హైదరాబాద్లో మరో భారీ మోసం బయటపడింది. చిట్టీల పేరుతో రూ. కోట్లు ముంచిన నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్పల్లికి చెందిన చేగొండి సూర్యనారాయణ, చేగొండి కనకదుర్గ, చేగొండి మాధురి చిట్టీలు వ్యాపారం నడిపించేవారు. ఈ క్రమంలో చిట్టీల రూపంలో 38 మంది నుంచి రూ. 2.5 కోట్లు వసూలు చేశారు. డబ్బు తిరిగి చెల్లించాలని ఖాతాదారులు కోరినప్పటికీ… వాయిదాలు వేస్తూ వచ్చారు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు… పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన కేపీహెచ్బీ పోలీసులు… చిట్టీల నిర్వాహకులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
చిట్టీల పేరుతో రూ. 2.5కోట్లు మోసం… అరెస్ట్

2020-12-26
Previous Post: అప్పటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..!